అన్వేషించండి

స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం

2027 కవాసాకి నింజా 300 భారత మార్కెట్లో రూ.3.34 లక్షల ప్రారంభ ధరకు విడుదలైంది. ధర రూ.17 వేల పెరిగినా, ఇంజిన్‌, ఫీచర్లు, డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు. డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

2027 Kawasaki Ninja 300 Price And Features Telugu: భారత మార్కెట్లో ప్రీమియం టూవీలర్‌ తయారీ సంస్థ కవాసాకి, తన "2027 నింజా 300" మోడల్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ను రూ.3.34 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది లాంచ్‌ అయిన "2026 మోడల్‌"తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ధర రూ.17,000 పెరిగింది. అయితే, రేటు పెరిగినప్పటికీ ఇంజిన్‌, ఫీచర్లు లేదా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

పవర్‌
2027 మోడల్‌లో కూడా అదే 296cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించింది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 39hp శక్తిని 11,000 rpm వద్ద & 26.1Nm టార్క్‌ను 10,000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పనితీరు పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటికే ఉన్న సెటప్‌ను కొనసాగించడం ద్వారా విశ్వసనీయతను నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈ కంపెనీ.

డిజైన్
2027 నింజా 300లో ఎలాంటి కొత్త మార్పులు లేవు. 2025లో (2026 మోడల్‌) ఈ బైక్‌కు ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్‌, ఎత్తైన విండ్‌స్క్రీన్ వంటి చిన్నపాటి అప్‌డేట్లు అందించగా, అదే రూపకల్పనను ఈ మోడల్‌లో కూడా కొనసాగించారు. దీంతో కొత్త మోడల్‌ను కొనుగోలు చేసే వారికి గత మోడల్‌తో పోలిస్తే రూపంలో ప్రత్యేకమైన తేడా కనిపించదు.

ఇది కూడా చదవండి: జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్

ఫీచర్లు
ఫీచర్ల పరంగా చూస్తే నింజా 300 ఇప్పటికీ సింపుల్ సెటప్‌తోనే అందుబాటులో ఉంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS భద్రతా వ్యవస్థను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ప్రత్యర్థి బైక్‌లలో కనిపించే ట్రాక్షన్ కంట్రోల్‌, రైడింగ్ మోడ్స్‌, క్విక్ షిఫ్టర్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ ఇందులో లేవు. అలాగే ఈ విభాగంలో ఇప్పటికీ అనలాగ్ టాకోమీటర్‌ను కొనసాగిస్తున్న అరుదైన బైక్‌లలో నింజా 300 ఒకటిగా నిలుస్తోంది.

2027 కవాసాకి నింజా 300ను కంపెనీ ఒక్క లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది. ఈ రంగు కవాసాకి రేసింగ్ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గుర్తింపుగా అభిమానుల్లో మంచి ఆదరణ పొందింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం జులై చివరి వారంలోనే ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో కొత్త మోడల్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులు త్వరలోనే తమ బైక్‌లను అందుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్

భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ విభాగంలో 2027 నింజా 300కు గట్టి పోటీ ఉంది. ఈ బైక్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా TVS Apache RR 310 & KTM RC 390 నిలుస్తున్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.78 లక్షల వరకు ఉండగా, కేటీఎం ఆర్‌సీ 390 ధర రూ.3.32 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో నింజా 300 ధర కొద్దిగా ఎక్కువైనా, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందించే స్మూత్ పనితీరు, కవాసాకి బ్రాండ్ విలువ, దీర్ఘకాలిక విశ్వసనీయత కారణంగా ఈ బైక్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం కొనసాగుతోంది.

కొత్త ఫీచర్లు లేకపోయినా, పనితీరు పరంగా ఇప్పటికే నిరూపితమైన ఇంజిన్‌, సూపర్‌స్పోర్ట్ స్టైలింగ్‌, కవాసాకి నాణ్యతను కోరుకునే రైడర్లకు 2027 నింజా 300 ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే అదే ధర పరిధిలో మరింత ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు కోరుకునే కొనుగోలుదారులు ప్రత్యర్థి మోడళ్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget