Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP Desam
ఫ్లోరిడా సముద్ర తీరంలో అంతరిక్షం నుంచి పడిన డ్రాగన్ క్యాప్స్యూల్ కు విశిష్ఠ అతిథుల నుంచి స్వాగతం లభించింది. క్యాప్సూల్స్ పడిన ధాటికి అప్రమత్తమైన అక్కడి చిన్న తిమింగలాలు డ్రాగన్ చుట్టూ తిరుగతూ సందడి చేయటం కనిపించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ విజువల్స్ లో వీటి కదలిక స్పష్టంగా కనిపించింది. మేం పిలవని అతిథులు ఆస్ట్రోనాట్లకు స్వాగతం పలకటానికి వచ్చాయంటూ నాసా కూడా ట్వీట్ చేసింది.డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ సంస్థ సహాయక సిబ్బంది క్యాప్సూల్ ను రెస్క్యూ చేసి ఆస్ట్రోనాట్లను బయటకు తీసుకువచ్చారు. ప్రత్యేకించి తొమ్మిది నెలలుగా ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే తన జీవితాన్ని గడిపిన సునీతా విలియమ్స్ రాక కోసం అంతా వేయి కళ్లతో ఎదురుచూశారు.డ్రాగన్ క్యాప్సూల్ కు రోప్స్ కట్టి దాన్ని అతి జాగ్రత్తగా రికవరీ బోట్ లోకి ఎక్కించారు. దీనికి దాదాపుగా అరగంటకు పైగా సమయం పట్టింది. ప్రాథమిక పరీక్షల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ ను రికవరీ బోట్ లోకి ఎక్కించారు.





















