Sunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి మీదకు డ్రాగన్ క్యాప్సూల్ లో సునీతా విలియమ్స్ తిరిగి వచ్చారు. క్రూ9 టీమ్ లోని మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి భూమిపైకి తిరుగు ప్రయాణం ప్రారంభించిన సునీతా విలియమ్స్ సుమారు 17 గంటల ప్రయాణం తర్వాత ఫ్లోరిడా సముద్ర తీరంపైన పారాచూట్ల సాయంతో సేఫ్ ల్యాండ్ అయ్యారు. వీరు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్యాప్సూల్ కి ఉన్న పారాచూట్లు తెరుచుకోగానే నాసా, స్పేస్ ఎక్స్ సైంటిస్టులు సంబరాలు చేసుకున్నారు. పారాచూట్లు సక్రమంగా తెరుచుకోవటంతో క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్రం తీరంలో సేఫ్ ల్యాండ్ అయ్యింది. క్యాప్సూల్స్ ల్యాండ్ అయిన వెంటనే క్యాప్సూల్ వద్దకు అమెరికన్ నేవీ కోస్ట్ గార్డ్ మెరైన్ బోట్లు దూసుకువచ్చాయి. ముందుగానే క్యాప్సూల్ పడే ప్రాంతాన్ని అంచనా వేసిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లు ఆ ప్రాంతానికి చేరుకుని ఏరియల్ సర్వే ద్వారా విజువల్స్ తీయటంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాసాకు చేర వేశాయి.





















