KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
BRS: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకు రావడేమే తన లక్ష్యమన్నారు.

KTR padayatra next year : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తున్నారు. త్వరలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా.. బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని కేటీఆర్ ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని నమ్మకం వ్యక్తం చేశారు. సూర్యాపేట నుంచి జిల్లాల యాత్ర ప్రారంభించిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించి ఈ వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్ర ప్లాన్ గురించి గత ఏడాది నవంబర్‌లో చెప్పిన కేటీఆర్
కేటీఆర్ పాదయాత్ర విషయాన్ని గత ఏడాది నవంబర్ లోనే ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రంలా ఉపయోగపడుతుంది. ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేకర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల , లోకేష్ వరకూ పాదయాత్రలు చేశారు. వారు పాదయాత్రలు చేసినప్పుడల్లా మంచి ఫలితాలు సాధించారు. అయితే షర్మిల మాత్రం రెండు సార్లు పాదయాత్రలు చేసినా ప్రయోజనం పొందలేకపోయారు.కానీ పాదయాత్రలకు ఉన్న క్రేజ్ వేరు.
పాదయాత్ర రాజకీయాల్లో సక్సెస్ ఫార్ములా
షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశారు కానీ.. కనీసం తనకైనా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి .. తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయిపోయారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్ర చేశారు కానీ కీలక సమయంలో ఆయనను టీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించడంతో పాదయాత్ర ఆగిపోయింది. బీజేపీ కూడా మంచి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించలేకపోయింది. ఏపీలో నారా లోకేష్ చేసిన యవగళం పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని దగ్గర చేసింది.
ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించే అవకాశం
ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న గడ్డు పరిస్థితుల్లో కేటీఆర్ కూడా పాదయాత్ర చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. పాదయాత్రలు చేస్తే మంచి ఫలితాలు వచ్చిన చరిత్ర ఉండటంతో కేటీఆర్ కూడా అదే తరహాలో పాదయాత్ర చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ క్యాడర్ నమ్మకం. అందుకే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడే అలాంటి ప్రయత్నాలు చేయలేమని.. ఎన్నికలకు ఏడాది లేదా ఏడాదిన్నర ముందు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది అన్నారు కాబట్టి.. 2026 మధ్యలోనే చివరిలోనే ప్రారంభించి ఏడాది పాటు పాదయాత్ర జరిపితే బీఆర్ఎస్ కు ఊపు వచ్చే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

