Horoscope Today: ఇల్లు, వాహనం, స్థలం కొనేందుకు ఈ రాశులవారికి ఇదే శుభసమయం!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 24 మంగళవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు డబ్బు గురించి చాలా ఆందోళన చెందుతారు. రుణం తీసుకోవడం సమస్యాత్మకంగా భావిస్తారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. చర్చల్లో మాటతూలొద్దు. రహస్య శత్రువులు మీకు హాని కలిగిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు అందర్నీ తొందరగా ఆకర్షిస్తారు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ఫీల్డ్‌లో మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన సమస్యను అధిగమిస్తారు.
మిథున రాశి
పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. నిర్వహణా పనుల్లో మంచి విజయం సాధిస్తారు. కుటుంబం మీతో ఏదైనా తీవ్రమైన విషయాన్ని చర్చించవచ్చు. ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది. మనస్సులో అభద్రత భావన ఉండవచ్చు.
కర్కాటక రాశి
ఈ రోజు ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. పురాతన విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. అనారోగ్యంతో ఉండేవారు కోలుకుంటారు.
సింహ రాశి
పాత తప్పులు ఇప్పుడు సమస్యగా మారుతాయి. మీరు పనిచేసే ప్రదేశంలో అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. మొబైల్ లేదా కంప్యూటర్‌ను జాగ్రత్తగా ఉపయోగించండి. మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయవద్దు.
కన్యా రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతారు. మీ క్రియాశీలత ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పెరుగుతుంది. పెళ్లి కాని వారికి సంబంధం కుదిరే సూచన ఉంటుంది. వ్యాపారుల ఆదాయం పెరగవచ్చు. క్రొత్త పనిని ప్రారంభేంచేందుకు ఇది శుభసమయం
తులా రాశి
ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనస్సులో ఏదో తెలియని భయం ఉంటుంది. కుటుంబంలో మార్పు గురించి చర్చిస్తారు. మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. మీరు తెలియని వ్యక్తి నుంచి చాలా సహాయం పొందుతారు.
వృశ్చిక రాశి
వ్యాపారాన్ని మెరుగుపరచుకునేందుకు సమయం సహకరిస్తుంది. అనవసర విషయాలపై పెద్దగా చర్చలు పెట్టొద్దు. మీ జీవిత భాగస్వామితో బంధం విషయంలో సానుకూల ఆలోచనలతో ఉండండి
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. పని విషయంలో ఓపికగా ఉండాలి. మీరు వ్యక్తిగత పనుల కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడకూడదు. మీపట్ల ఇంటి సభ్యులు కూడా అసంతృప్తిగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు బయటవారితో చర్చించవద్దు.
మకర రాశి
ఈ రోజు మీకు శుభదినం అవుతుంది. పనిచేసే ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వివాహం గురించి ప్రేమికులు చర్చించుకునేందుకు మంచి రోజు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
ఏదైనా సమస్య కారణంగా ఇబ్బందుల్లో పడతారు. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు అనాలోచిత స్థితిలో ఉన్నట్టైతే స్నేహితుల నుంచి సహకారాన్ని పొందవచ్చు. ఇతరుల వ్యవహారాలకు స్పందించవద్దు.
మీన రాశి
ఓ విషయంలో పడుతున్న ఆందోళన ఈ రోజు తొలగిపోతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో చికాకులు తగ్గుతాయి. నూతన ఆస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

