Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Bigg Boss 9 Telugu Grand Finale Highlights - Review : బిగ్ బాస్ సీజన్ 9 ఆఖరి అంకానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ జరిగిన లాస్ట్ ఎపిసోడ్లో తనూజ - కళ్యాణ్ లలో విన్నర్ ఎవరో స్వయంగా నాగార్జున తేల్చారు.

బిగ్ బాస్ డే 105 ఎపిసోడ్ లో నాగార్జున సైమన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. "రణరంగం చివరి అంకానికి చేరుకుంది. సత్తా చాటిన కామనర్స్, సెలబ్రిటీలు దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలబెట్టారు. ఈ యుద్ధ భూమిలో ఆ ట్రోఫీ ఎవరిది కాబోతుందో ఈ రాత్రి నిర్ణయిస్తుంది" అంటూ గ్రాండ్ ఫినాలేని మొదలు పెట్టారు హోస్ట్ నాగార్జున. ముందుగా ఎక్స్ హౌస్ మేట్స్, టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ ను ఆహ్వానించారు. కళ్యాణ్ 'దేఖ్ లేంగే సాలా' పాటకు, తనూజా, డెమోన్, సంజన, ఇమ్మూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
ఇది అన్నీ సీజన్లకంటే మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్, కంట్రీలోనే నెంబర్ 1 షో అని చెప్తూ అన్నీ జ్ఞాపకాలను ఏవీ ద్వారా రీకలెక్ట్ చేసుకున్నారు. 14 వారాలు దేనికోసం తపించారో ఆ ట్రోఫీ ఇదే అంటూ సీజన్ 9 ట్రోఫీని పరిచయం చేసారు. ట్రోఫీతో పాటు మారుతి సుజుకి విక్టోరిస్, 50 లక్షల ప్రైజ్ మనీ కూడా విన్నర్ తీసుకెళ్తారు అని నాగ్ అనౌన్స్ చేశారు. కాగా మంగ్లీ, డింపుల్ హయతి, పాయల్ రాజ్ పుత్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
తర్వాత ఒక్కొక్కరుగా హౌస్ మేట్స్ తో విన్నర్ స్పీచ్ ఇప్పించారు. కళ్యాణ్ సంజనాను, ఇమ్మూ డెమోన్ ను, సంజనా తనూజను, డెమోన్ కళ్యాణ్ ను, తనూజా ఇమ్మూను ఇమిటేట్ చేసి చూపించారు."నేను పరిచయం చేసిన ఛాంపియన్ రోషన్ ను ఇన్వైట్ చేస్తున్నా" అంటూ బిగ్ బాస్ స్టేజ్ పై 'ఛాంపియన్' మూవీని ప్రమోట్ చేశారు. అలాగే రోషన్ తండ్రి, సీనియర్ హీరో శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్ళి సంజనాను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. శ్రీకాంత్ "సెంటిమెంట్ అయింట్మెంట్" అంటూ భరణి తన ఫేవరెట్ అని చెప్పాడు.
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్
సోమవారం షురూ కానున్న "బీబీ జోడి 2" షో జడ్జిలు శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్ కుమార్ ను ఆహ్వానించి, ప్రోమోను ప్లే చేశారు. అనంతరం అన్నీ తనే నాకు అంటూ తనూజాకు ఎల్లో బ్యాండ్, భరణికి సారీ చెప్తూ సపోర్ట్ చేయలేకపోయాను అని గ్రీన్ బాండ్ ఇచ్చాడు కళ్యాణ్. రమ్య నాకు సారీ చెప్పాలి ఆమె ఒక్కతే బ్లాక్ మార్క్ అని అన్నాడు. అలాగే తనూజా, ఇమ్మూ కూడా భరణికే సారీ చెప్పారు. ఫెంటాస్టిక్ ఫోర్ ను టెర్రిఫిక్ త్రీ చేయడానికి అనగనగా ఒకరోజు నవీన్ పోలిశెట్టి హౌస్ లోకి అడుగు పెట్టారు. హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా వచ్చింది. "అన్నపూర్ణ స్టూడియో మీద కన్ను పక్కన పెట్టీ భీమవరం మీద ఫోకస్ చెయ్ మూవీ సంక్రాంతికి రాబోతోంది" అంటూ నాగ్ నవీన్ కు కౌంటర్ ఇచ్చారు. "మా మూవీని హిట్ చేస్తే అన్నపూర్ణ స్టూడియో పక్కన ఓ ఎకరంలో మేము కూడా స్టూడియో కట్టుకుంటాం" అన్నాడు నవీన్. థర్డ్ సెలబ్రిటీ గెస్ట్ రోగ్ అనే రోబో డాగ్ ను నవీన్ తో హౌస్ లోకి పంపారు. నవీన్ అడిగిన ప్రశ్నలకు రోగ్ సమాధానం చెప్పింది. అదే ఇమ్మూను ఎలిమినేట్ చేసింది.
డెమోన్ ఎలిమినేషన్
రవితేజ, డింపుల్, ఆషిక రంగనాథన్ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" ప్రమోషన్లలో భాగంగా హౌస్ లోకి వెళ్ళారు. రవితేజ సిల్వర్ సూట్ కేస్ లో 5 లక్షలు పట్టుకెళ్ళాడు. డెమోన్ రిక్వెస్ట్ మేరకు పేరెంట్స్ తో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. కానీ వాళ్లు నీ ఇష్టం అని చెప్పారు. చివరకు రవితేజ 5 నుంచి 15 లక్షలకు అమౌంట్ పెంచడంతో డెమోన్ కన్విన్స్ అయ్యాడు. లక్కీగా అతనే టాప్ 3లో ఉన్నాడు. డెమోన్ 15 తీసుకున్నాడు కాబట్టి విన్నర్ కు మిగిలేది 35 లక్షలు.
విన్నర్ అనౌన్స్మెంట్
టాప్ 2 కోసం గోల్డెన్ బ్రీఫ్ కేసు పట్టుకుని నాగార్జున హౌస్ లోకి వెళ్ళారు. 20 లక్షల వన్ టైమ్ ఆఫర్ ఇస్తే కళ్యాణ్ - తనూజ ఇద్దరూ రిజెక్ట్ చేశారు. ఇందులో కృష్ణుడి పాత్ర అంటూ నాగార్జున జర్నీకి సంబంధించిన స్పెషల్ ఏవీని వేశారు. తరువాత టాప్ 2లో విన్నర్ కళ్యాణ్ అని బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున అనౌన్స్ చేశారు.
Also Read: ధురంధర్ OTT డీల్ సెట్... 'పుష్ప 2' రికార్డు అవుట్... నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే?





















