Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
T20 ప్రపంచ కప్ 2026 కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఇషాన్ కిషన్ రెండవ వికెట్ కీపర్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత T20 టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు. అది కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీకి. 2024 ఫిబ్రవరిలో ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి చోటు కోల్పోయాడు. ఆ తర్వాత బాగానే కష్టపడ్డాడు. ఝార్ఖండ్ టీమ్ ను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ విజేతగా నిలిపాడు. T20 ప్రపంచ కప్ 2026 టీమ్ లో సెలెక్ట్ అవడంపై ఇషాన్ కిషన్ స్పందించాడు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. టీమ్ తో కలవడానికిఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని చెప్పాడు. గత కొంతకాలం నుంచి భారత జట్టు చాలా బాగా ఆడుతోందని అని కూడా అన్నాడు.
ఇషాన్ కిషన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేసి, "బ్యాక్, బెటర్" అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇషాన్ కిషన్ ఇటీవలి ఫామ్‌ను చూసి అతన్ని T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో ఎంపిక చేశారని.. ఫామ్ లేని కారణంగానే శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమయ్యాడని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.





















