అన్వేషించండి

Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..

Steel Bridge In Hyderabad | వివాదాస్పద సంతోష్  నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటో మీకు తెలుసా.. ? ఈ స్టీల్ బ్రిడ్జి గురించి స్థానికులు ఏబీపీ దేశంతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

హైదరాబాద్ లోని చంచల్‌గూడ టూ సంతోషన్ నగర్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్మిస్తున్న సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తవ్వకముందే తెలుగు రాష్ట్రాల్లో  ట్రెండింగ్ బ్రిడ్జిగా వార్తల్లో నిలిచింది. ఒళ్లు గగుర్పొడిచేలా,  అత్యంత ప్రమాదకరంగా సాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు, సేఫ్టీ లేకుండా బ్రిడ్జ్ పై కార్మికులు చేస్తున్న విన్యాసాలు, అత్యంత బరువై గిడ్డర్లును బ్రిడ్జిపై తీసుకెళ్తున్న వీడియోలు పెను దుమారం రేపాయి. కార్మికుల ప్రాణాలతోపాటు తేడా వస్తే బ్రిడ్జి క్రింద ప్రయాణిస్తున్న వాహనదారులు తలలు  కూడా పుచ్చకాయల్లా పగిలేలా ఉన్నాయంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై తీవ్ర విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా గిడ్డర్లు వంటి అత్యంత బరువైన ఇనుప పిల్లర్ల అమరిక రాత్రి వేళల్లో ఎవరి కంట పడకుండా చేసేందుకు నిర్మాణ సంస్ద సిద్దమైయ్యింది.

3 కిలోమీటర్లకు 30 నిమిషాలకు పైగా..

ఇంతలా వార్తల్లో చక్కర్లు కొట్టిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి, ఇక్కడ స్దానికులకు మాత్రం దశాబ్దాల నాటి కల. సంతోష్ నగర్ టూ సైదాబాద్ మీదుగా చంచల్ గూడ వెళ్లాలంటే కేవలం 3 కిలోమీటర్ల దూరం 30 నుండి 40 నిమిషాలకు పైగా సమయం పట్టేది. అంతలా ట్రాఫిక్ కష్టాలతో ఇక్కడ వాహనదారులు పట్టపగలే చుక్కలు చూసేవారు. ఈ  స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో రివ్వుమంటూ దూసుకుపోవచ్చంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్ సిటీలో సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ రెండవ అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి కావడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. సంతోష్ నగర్, యాదగిరి సినిమా  థియేటర్ వద్ద నుండి మొదలై, చంచల్ గూడ జైలు దాటే వరకూ 3.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జి నిర్మాణం, మూడు ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి, చంచల్ గూడ జంక్షన్ మీదుగా వెళుతుంది. అత్యంత రద్దీగా ఉంటే నల్గొండ ఎక్స్ రోడ్ మీదుగా సంతోష్ నగర్ వైపు వచ్చే వాహనదారులకు ఈ  నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్  కష్టాలకు మోక్షం లభించినట్లే..

650 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ కు గత బీఆర్ఎస్ హయాంలోనే శంకుస్దాపన చేశారు. నాలుగేళ్ల క్రితమే పనులు ప్రారంభమైనా  తీవ్ర జాప్యం జరుగుతోంది. అతి కష్టం మీద నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వార్తల్లోకెక్కింది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. 

సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పై స్దానికులు ఏమంటున్నారంటే..?

ఈ స్టీల్ బ్రిడ్జ్ పూర్తయితే సైదాబాద్ నుండి సంతోషనగర్ వైపు వచ్చే వాళ్లు, ఇక్కడి నుండి చంపాపేట్, సైదాబాద్  వెళ్లాలన్నా మూడు ప్రధాన మార్గాలకు పెద్ద జంక్షన్ కావడంతో ఈ బ్రిడ్జ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇబ్రహీంపట్నం బస్సులు మిధాని వెళ్లాలన్నా, కోటి వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి.సైదాబాద్ లో ఇరుకు రోడ్లు, ఇక్కడ మార్గెట్ కూడా నిత్యం రద్దీగా ఉంటం వల్ల , ఈ బ్రిడ్జి పూర్తయితే 90శాతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గిపోతుంది. సంతోష్ నగర్ టూ మలక్ పేట్ ఇప్పుడు 5నిమిషాల్లో వెళ్లిపోతారు.  గతంలో గంట సమయం పట్టేది. -  విజయేంద్ర రెడ్డి, సంతోష్ నగర్..


Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..

ఆర్టీసీ బస్సులు, నల్గొండ వెళ్లే వాహనాలు ఈ రహదారి మీదుగా వెళుతుండటంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య  విపరీతంగా ఉంది. రోడ్ క్రాస్ చేసేవాళ్లు అనేసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ పూర్తయితే చాల ఉపయోగం ఉంటుంది.  మలక్ పేట్ , చాధర్ ఘాట్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టినట్లవుతుంది. వివిధ జిల్లాల నుండి వచ్చేవాళ్లకు సైదాబాద్ మార్కెట్ కు రావాలంటే నరకం చూసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్దితి మారుతుంది.  -  ఎం.ఏ. రజాక్, సైదాబాద్..


Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..

మాధన్నపేట వద్ద విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.స్కూల్స్, ఇంజరీరింగ్ కాలేజీలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ పూర్తయితే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా సంతోష్ నగర్ నుండి మలక్ పేట్ వెళ్లాలంటే ఉదయం,  సాయంత్రం వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇన్నాళ్లు పట్టింది. సాధ్యమైనంత త్వరగా రాకపోకలు ప్రారంభించాలని కోరుకుంటున్నాము.  -  అఫ్జల్ వయ్యద్, చంచల్ గూడ.. 


Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget