అన్వేషించండి

Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..

కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తన శాఖల్లో చేపట్టిన పనులు, జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుక్ లెట్ ఆవిష్కరించారు.

అమరావతి: ఏపీలో అధికారం చేపట్టి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను బుక్‌లెట్ వేయించి ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియోజక వర్గాలవారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. 


మార్చి 6న శుక్రవారం శాసనసభలో ఈ బుక్ లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్, నీటి తొట్టెల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి తొలి కాపీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరిట రూపొందించిన ఈ బుక్ లెట్ తొలి ప్రతిని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ ఛాంబర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్, ఆయన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. పల్లెపండగ 1.0కి రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 ద్వారా రూ. 58.85 కోట్లు ఖర్చు చేసి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లతో పనులు చేపట్టినట్టు, 15వ ఆర్ధిక సంఘం నిధులు మరో రూ. 173.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మలి ప్రతిని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ. 168 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అందులో పల్లెపండగ 1.0 కింద రూ. 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలు, 4 ఫారం పాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలకు కాపీలను ఆయన అందజేశారు.

కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 487 కోట్లు
 సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో రూ.487 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా చేపట్టారు. వాటిలో పల్లెపండగ 1.0 ద్వారా రూ. 46.71 కోట్లు ఖర్చు చేశారు. పల్లెపండగ 2.0కి రూ. 138 కోట్లు,  జల్ జీవన్ మిషన్ కు రూ. 7.12 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 185.89 కోట్లు ఆ నియోజకవర్గ పరిధిలో పంచాయతీలకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ. 110 కోట్లు ఇచ్చారు. ఈ ప్రక్రియలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేశారు.

పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయించారు. పల్లె పండగ 1.0 ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల   రహదారులు, 22,514 మినీ గోకులాలు, 1,02,000 ఫారం పాండ్స్, 15 వేల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 65 వేల ఎకరాల్లో పండ్ల తోటలు నాటించారు. పల్లెపండగ 2.0లో రూ. 5,715 కోట్లతో గ్రామాల్లో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లు, 15 వేల మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, ఫారం పాండ్స్, నీటితొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు నాటే ప్రక్రియ పూర్తయింది. రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులుతో 4,122 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా రూ. 1,005 కోట్ల నిధులుతో గిరిజన గ్రామాల్లో 1,021 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. తద్వారా 625 ఆవాసాలకు తొలిసారి రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులు,  మానవ వన్యప్రాణి సంఘర్షణ (Man vs Wild)ను నివారించేందుకు హనుమాన్ లాంటి ప్రాజెక్టులను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget