అన్వేషించండి

Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!

TDP Politics | తిరువూరులో టీడీపీ నేతల మధ్య విభేదాలు తొలగిపోయాయి. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు

కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ వివాదాలకు ఎట్టకేలకు తెరపడింది.  కొలికపూడితో మంతెన సత్యనారాయణ రాజు  భేటీ అయి, పార్టీలో దీనిపై ఉన్న సీరియస్ నెస్, రాజకీయంగా కలిగే నష్టాలను చర్చించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం ఈ వివాదాలపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. తిరువూరులో నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలన్నీ ముగిసినట్లేనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్టకు ఏవైనా ఇబ్బందులు కలిగించి ఉంటే తాను చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

అధికార ప్రోటోకాల్, పరస్పర గౌరవం గురించి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇస్తానని, అదే సమయంలో ఆయన నుంచి కూడా తాను అదే గౌరవాన్ని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం కార్డును వాడటం తన అభిమతం కాదని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

కొలికపూడి చేసిన ఆరోపణలు.. స్పందించిన పార్టీ అధిష్టానం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ప్రాణాలకు ముప్పు ఉందని గురువారం ఆరోపించారు. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన ఘటనను ఉటంకిస్తూ, తనపై దాడి చేసి చంపేందుకు పక్కా ప్రణాళిక జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కార్యాలయం నుంచే మధ్యాహ్నం నుండి జనాన్ని సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయని, తనను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నారని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం స్పందించింది. ఇది వ్యక్తిగతంగానే కాదు, పార్టీకి నష్టం కలిగిస్తుందని.. విభేదాలు మంచిది కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం తీరుపై కూడా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల ద్వారా తన గన్ మెన్‌కు ముందస్తు హెచ్చరికలు అందినప్పటికీ, తనకు కనీసం ఒక అదనపు కానిస్టేబుల్‌ను కూడా భద్రతగా కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణం సమయంలో కరెంట్ తీసివేసి చీకట్లో తనపై దాడి చేయాలని ప్లాన్ చేశారని, అయితే పోలీసులు అందుకు నిరాకరించడం వల్ల ప్రమాదం తప్పిందని తనకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు.

తన కారు అద్దాలు పగలగొట్టి, టైర్ల గాలి తీసి తనను అడ్డుకుని భౌతిక దాడి చేయాలని చూశారనే స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో చెప్పారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా తనకు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Pachpadra Refinery: రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
Purusha: సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
Embed widget