అన్వేషించండి

Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Botsa Chit Chat: చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్తే పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇవ్వొచ్చని బొత్స అన్నారు. పెద్ద కులానికి అవకాశం ఇచ్చేందుకు ఇలా చేస్తారని జోస్యం చెప్పారు.

YCP MLC Botsa Chit Chat in Assembly: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో కీలక వ్యాఖ్యలు చేశారు.  శాసనమండలి చైర్మన్‌పై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూడటంపై బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అవిశ్వాసం పెట్టాలంటే ముందు సంఖ్యాబలం ఉండాలి కదా.. నెంబర్ లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారు  అని ఆయన ప్రశ్నించారు. కేవలం చైర్మన్‌ను భయపెట్టడానికే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, రాజకీయాల్లో తాము ఇలాంటివి ఎన్నో చూశామని కొట్టిపారేశారు. సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, అందుకే తాము వాకౌట్ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.

 లడ్డూ వివాదం.. హెరిటేజ్ - ఇందాపూర్ లింకు                      

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని బొత్స ఆరోపించారు. హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉందని  స్పష్టం చేశారు. బయట మార్కెట్‌లో హెరిటేజ్ నెయ్యి రూ. 600లకు దొరుకుతుంటే, ఇందాపూర్ డైరీ టీటీడీకి రూ. 658లకు ఎందుకు సరఫరా చేస్తోందని ప్రశ్నించారు. తక్కువ ధరకు ఇచ్చే హెరిటేజ్ నెయ్యిని కల్తీ అనుకోవాలా అని ప్రశ్నించారు. నెయ్యి వివాదం ఎప్పటికి ముగుస్తుందన్న ప్రశ్నకు  దేవుడే చూసుకుంటాడు  అంటూ నిట్టూర్చారు.

 పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై విశ్లేషణ                              

చంద్రబాబు నాయుడు ఒకవేళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే, రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు.  పవన్ సీఎం అయితే ఒక పెద్ద సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని చంద్రబాబు భావించవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏదైనా చేస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ  అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేస్తూనే, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, జమిలి ఎన్నికల ప్రచారం  కారణమంగా సమీకరణాలు మారవచ్చని సూచనప్రాయంగా చెప్పారు.

 వైసీపీ బలంపై ధీమా.. అంగన్‌వాడీలకు మద్దతు                            

పవన్ కళ్యాణ్ గతంలో రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం సరికాదన్నారు.  ఈ రోజే ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం  అని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఇక అంగన్‌వాడీల సమస్యలపై స్పందిస్తూ.. గతంలో తాము జీతాల పెంపునకు అంగీకరించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.                    

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget