అన్వేషించండి

IND vs ENG: ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 రికార్డులు ఇవే.. మనదే జోరు

IND vs ENG Semi Final Records List: రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో 5 రికార్డులు బద్దలయ్యాయి.

India vs England Semi Final: 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ టీం చివరివరకూ పోరాడినా 246 పరుగులు చేయగలిగింది. విజయానికి కేవలం 7 పరుగుల దూరంలో ఆగిపోవడంతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు సంజూ శాంసన్ 89 పరుగులు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో 499 పరుగులు నమోదయ్యాయి. మొదటి నుంచి చివరి వరకు భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 5 భారీ రికార్డులు బద్దలయ్యాయి. అద్భుతమైన ఫీల్డింగ్ భారత జట్టును ఓటమి నుంచి తప్పించిందని చెప్పవచ్చు. 

భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 భారీ రికార్డులు

ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు: భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే. అంతకుముందు ఈ రికార్డు 459 పరుగులు. 2016లో జరిగిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆ స్కోరు నమోదైంది.

జాకబ్ బెథెల్ వరల్డ్ రికార్డు: ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. ఇదే మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇది టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా నిలిచింది. 

ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు: భారత్, ఇంగ్లాండ్ 2వ సెమీఫైనల్ మ్యాచ్‌లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు నమోదు కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు వచ్చాయి. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు 31 సిక్సర్లతో ఉండేది. ఇదే టోర్నమెంట్‌లో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లో ఆ రికార్డు నమోదైంది.

ఒక టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు (టీమ్): ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ వరల్డ్ కప్‌లో 88 సిక్సర్లు బాదేసింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ విషయంలో ఇండియా  టీం వెస్టిండీస్‌ను అధిగమించింది. ఇదే టీ20 వరల్డ్ కప్‌లో విండీస్ బ్యాటర్లు 76 సిక్సర్లు బాదారు.

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250+ పరుగులు: మెన్స్ టీ20 క్రికెట్‌లో భారత్ 250 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయడం ఇది ఆరోసారి. ఈ విషయంలో భారత్ ఒక వరల్డ్ రికార్డు నిలిపింది. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో మూడుసార్లు ఈ ఘనత సాధించాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget