Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
Bigg Boss 9 Telugu Today Episode - Day 104 Review : మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలోనే హౌస్ లో శ్రీముఖి, ప్రదీప్, లయ, నిధి అగర్వాల్, శివాజీ సందడి చేశారు.

డే 104 ఎపిసోడ్ లో సడన్ గా 'సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని' మూవీ టీం లయ, శివాజీ, రోహన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. శివాజీ డాక్టర్ గెటప్లో వచ్చి తనూజాకు షాక్ ఇచ్చారు. ఇక్కడ కంటెస్టెంట్ గా ఉన్నప్పటి ఓల్డ్ మెమోరీస్ ను గుర్తు చేసుకున్న ఆయన... డెమోన్, సంజనాలను తనదైన స్టైల్ లో రోస్ట్ చేశారు. లయ - శివాజీ... డెమోన్ - రీతూలను ఇమిటేట్ చేసి చూపించారు. రోహన్, లయలకు వెల్కమ్ పలికిన బిగ్ బాస్ శివాజీని మాత్రం పలకరించకుండా ఆట పట్టించారు. పెడస్టాల్ పై ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటిగా నీటిలో మునుగుతుందా లేదా? అనే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే టాస్క్ పెట్టారు హౌస్ మేట్స్ కి. ఆటగాడు డెమోన్ పవన్ విన్నర్ అని ప్రకటించారు. చివరకు గ్యాంగ్ లీడర్ సాంగ్ కి స్టెప్పులేసి వాళ్ళను బయటకు పంపారు.
హౌస్ లోకి 'ది రాజా సాబ్' బ్యూటీ
మధ్యాహ్నం 2 గంటలకు 'ది రాజా సాబ్' హీరోయిన్ నిధి అగర్వాల్ హౌస్ లోకి అడుగు పెట్టింది. "పాపలకి పాపా నిధి పాపా" అంటూ ఆమెకు ఇల్లంతా తిప్పి చూపాడు ఇమ్ము. ఒక్కొక్కరూ హార్రర్ స్టోరీ చెప్పాలని నిధి అడగ్గా... హార్రర్ అయినా, కామెడీ అయినా ఆమె ఒక్కతే చేస్తుంది అంటూ సంజనాను చూపించారు. "3 ఏళ్లు షూట్ చేశాము. మొత్తానికి జనవరి 9న మూవీ రిలీజ్ కాబోతోంది" అని మూవీ ముచ్చట్లు చెప్పింది నిధి. "విన్ అయితే ఏం చేస్తారు?" అని అడగ్గా.. ఇమ్మూ. కళ్యాణ్, తనూజా, డెమోన్ సినిమా అని, సంజన సోషల్ గ్యాదరింగ్ చేస్తా అని చెప్పారు. తరువాత నిధి అగర్వాల్ టాప్ 5కి బ్లైండ్ ఫోల్డ్, బీన్ బ్యాగ్ టాస్క్ ఆడించారు. ఈ టాస్క్ ఆడుతుండగా, కళ్యాణ్ కు కంటిపై దెబ్బ తగిలింది. దీంతో అతన్ని పక్కన పెట్టి, మిగతా వాళ్ళు ఆడగా, సంజన టాస్క్ లో గెలిచింది.
ప్రదీప్ - శ్రీముఖి ఎంట్రీ
సాయంత్రం 5 గంటలకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరి గేమ్ పై ప్రశంసలు కురిపించారు. 'బీబీ జోడి సీజన్ 2' స్టార్ట్ కాబోతోంది అంటూ షోకి అందరినీ ఇన్వైట్ చేశాడు. ముందున్న స్క్రీన్ లో వచ్చే బొమ్మలు ఎలా సౌండ్ చేస్తాయో అలా సౌండ్ చేసి చూపించాలి అనే టాస్క్ ఇచ్చారు. అతను వెళ్లిపోగానే శ్రీముఖి వచ్చి డెమోన్, కళ్యాణ్ "మా అగ్ని పరీక్ష ప్రొడక్ట్స్" అంటూ మురిసిపోయింది. కళ్యాణ్ చిట్టిబాబు, తనూజా భానుమతి, డెలివరీ బాయ్ పుష్ప గా ఇమ్మూ టాస్క్ చేశారు. అలా వెళ్ళిపోయి మళ్ళీ ప్రదీప్ తో కలిసి వచ్చింది శ్రీముఖి. అలాగే బ్యాండ్ రుద్రను తీసుకొచ్చారు.
"మీ త్రూ అవుట్ జర్నీలో ఫస్ట్ డే ఏం అనుకున్నారు? ఇప్పుడెలా మారారు" అని అడిగారు హౌస్ మేట్స్ ను. కళ్యాణ్ గురించి తనూజ, తనూజ గురించి కళ్యాణ్ ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పుకొచ్చారు. అలాగే సంజన ఇమ్మూ, డెమోన్ఇ, సంజనల గురించి ఇమ్మూ చెప్పుకొచ్చారు. చివరగా సీజన్ 10 కంటెస్టెంట్ కి ఇచ్చే సలహాను రాసి సీసాలో పెట్టి, హౌస్ లోనే పాతేయమన్నారు. ఏడాది తర్వాత వచ్చే కంటెస్టెంట్స్ అది చదువుతారు అని బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. కేక్ తో లాస్ట్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు.





















