Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
PM Modi Biopic : భారత ప్రధాని మోదీ బయోపిక్ 'మా వందే' షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు.

PM Modi Biopic Maa Vande Shooting With Pooja Ceremony : భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ 'మా వందే'గా రాబోతోన్న సంగతి తెలిసిందే. మోదీ రియల్ లైఫ్ ఘటనలు, ఆయన ఇన్‌స్పిరేషనల్ పొలిటికల్ జర్నీని ఈ మూవీలో చూపించనున్నారు. మోదీ రోల్‌లో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తుండగా... పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
ఈ మూవీకి సీహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నామని డైరెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. శనివారం నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా "మా వందే సినిమాలో చూపించబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'మా వందే' చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. 
Also Read : పొలిటికల్ లీడర్ Or సీనియర్ ఆఫీసర్‌గా రేణు దేశాయ్? - 'బ్యాడ్ గాళ్స్' మూవీలో కీ రోల్
Maa Vande Cast And Technical Team : నటీనటులు - ఉన్ని ముకుందన్, రవీనా టాండన్ తదితరులు
టెక్నికల్ టీమ్ - యాక్షన్ - కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ - సాబు సిరిల్, ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్, డీవోపీ - కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ - రవి బస్రుర్, బ్యానర్ - సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి., లైన్ ప్రొడ్యూసర్ - టీవీఎన్ రాజేశ్, మార్కెటింగ్ - వాల్స్ అండ్ ట్రెండ్స్, నిర్మాత - వీర్ రెడ్డి.ఎం, రచన, దర్శకత్వం - క్రాంతికుమార్.సి.హెచ్.





















