Eesha Movie : రిలీజ్‌కు ముందే భయపెడుతున్న 'ఈషా' వార్నింగ్ వీడియో - ఇది చూడకపోవడమే బెటర్
Eesha Trailer Reaction : హెబ్బా పటేల్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' మరో థ్రిల్లింగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. 'ఈషా' వార్నింగ్ వీడియో పేరుతో రిలీజ్ చేయగా భయపెడుతోంది.

Hebah Patel's Eesha Movie Warning Video Out : త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ భయపెట్టేస్తుండగా... రిలీజ్‌కు ముందే ఓ వార్నింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
గుండె ధైర్యం కావాల్సిందే
నిజంగా ఈ వార్నింగ్ వీడియో చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. క్షుద్రపూజలు, ఓ చిన్నారి దెయ్యం పట్టినట్లుగా ఉండే సీన్‌తో వీడియో ప్రారంభం కాగా... 'మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే కొన్ని శాపగ్రస్తమై ఉంటాయి. తర్వాత క్రమంగా అవి ఆత్మలకు నిలయంగా మారుతాయి.' అనే డైలాగ్ భయపెడుతుంది. నలుగురు ఫ్రెండ్ ఓ మారుమూల విలేజ్‌లో హాంటెట్ హౌస్‌లోకి వెళ్లగా అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అసలు ఆ హౌస్ హిస్టరీ ఏంటి?, ఆత్మల నుంచి వారు బయటపడ్డారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
స్టోరీ అదేనా?
ఇప్పటివరకూ హారర్ థ్రిల్లర్ జానర్‌లో చాలా మూవీస్ వచ్చినా... వార్నింగ్ వీడియో పేరిట ఇలా రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్‌లో భయపెట్టిన దర్శకుడు శ్రీనివాస్ మన్నే ఈ వార్నింగ్ వీడియోలోనూ పవర్ ఫుల్ థ్రిల్లింగ్ డైలాగ్‌తో హైప్ క్రియేట్ చేశాడు. 'దెయ్యాలు, ఆత్మలు ఇలాగే ఉంటాయేమో' అంటూ సిరి చెప్పే డైలాగ్.. అందరిని ఒక్కసారిగా ఆత్మల గురించి అందరి మదిలో మెదిలేటట్టు చేస్తుంది.
ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో మూఢ నమ్మకాలు, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబా పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. "ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే.." అంటూ ఆయన విసిరే ఛాలెంజ్‌తో వీరు ఓ చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్‌కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్‌ని ఎలివేట్ చేశాయి.
మూవీలో హెబ్బా పటేల్‌తో పాటు అఖిల్ రాజ్, సిరి, హన్మంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించగా... హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్ హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గుండె జబ్బులు ఉన్న వారు ఈ మూవీకి దూరంగా ఉండడమే మంచిదంటూ బన్నీ వాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఫుల్ థ్రిల్ పంచేలా వీడియోలు మూవీని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.





















