Abbas Re Entry: 'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
Abbas In Happy Raj Movie: 'ప్రేమ దేశం'తో తెలుగులోనూ తమిళ కథానాయకుడు అబ్బాస్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు.

తమిళ కథానాయకుడు అబ్బాస్ (Actor Abbas) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'ప్రేమ దేశం'తో తెలుగులోనూ ఆయన పాపులర్ అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'నరసింహ'లో క్యారెక్టర్ కూడా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. మరికొన్ని సినిమాల్లోనూ నటించిన అబ్బాస్... కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు 11 ఏళ్ళ తర్వాత తమిళ తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ... కొద్ది మంది మాత్రమే మహిళల హృదయాలను గెలుచుకోగలిగారు. అలాంటి వారిలో 90లలో మహిళల మనసులను దోచుకున్న హీరో అబ్బాస్. ఆయన రీ ఎంట్రీ సైతం మాంచి స్టైలిష్ లుక్క్‌లో ఉంది.
'హ్యాపీ రాజ్'లో అబ్బాస్!
సంగీత దర్శకుడు - తమిళ కథానాయకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'హ్యాపీ రాజ్'. ఇందులో అబ్బాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇటీవల సినిమా ప్రోమో విడుదలైంది. అందులో అబ్బాస్ హెయిర్ స్టైల్, లుక్స్ బావున్నాయి. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ తండ్రిగా అబ్బాస్ నటించారు. ఆయన జార్జ్ మరియన్‌తో పోరాడుతున్నట్లుగా సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Also Read: ధురంధర్ OTT డీల్ సెట్... 'పుష్ప 2' రికార్డు అవుట్... నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే?
Good to see Abbas onscreen after a long time in #HapppyRaj👌
— AmuthaBharathi (@CinemaWithAB) December 20, 2025
Abbas Vs George Mariyan😁🤼♂️pic.twitter.com/B6LJ1Fkcii
పూర్తిగా హాస్యభరితంగా తెరకెక్కిన 'హ్యాపీ రాజ్' చిత్రంలో అబ్బాస్ (Abbas Look In Happy Raj)ను మళ్ళీ తెరపై చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా మంది సంతోషించారు. అదే సమయంలో 'తని ఒరువన్' (తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ అయిన 'ధృవ') చిత్రం ద్వారా అరవింద్ స్వామి రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా కాకుండా... కామెడీ పాత్రలో అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చారని కొందరు ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇకపై అబ్బాస్‌ను తమిళ సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూడవచ్చు.
హీరో, సెకండ్ హీరోగా నటించినప్పటికీ...
'ప్రేమ దేశం' చిత్రం ద్వారా అబ్బాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతో అతనికి భారీగా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత 'VIP', 'పూచూడవ' వంటి విజయవంతమైన తమిళ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ 'పడయప్ప' (తెలుగులో డబ్బింగ్ 'నరసింహ', కమల్ హాసన్ 'హే రామ్', మమ్ముట్టి 'ఆనందం', సత్యరాజ్ 'మలబార్ పోలీస్', అజిత్ 'కందుకొండెన్ కందుకొండెన్', మాధవన్ 'మిన్నలే' చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ... కెరీర్‌లో కీలక దశలో చాలా చిత్రాల్లో సెకండ్ హీరోగా నటించారు. అది కూడా అతనికి ఒక మైనస్ అయ్యింది.
11 ఏళ్ల తర్వాత తమిళ సినిమా
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో కూడా అబ్బాస్ నటించారు. అతను సోలో హీరోగా నటించిన చిత్రాలు పెద్ద విజయాలు ఇవ్వలేదు. అందుకే 2010 తర్వాత పెద్దగా నటించలేదు. చివరిగా మలయాళంలో 'పచ్చకల్లమ్' చిత్రంలో నటించారు. చివరిసారిగా తమిళంలో 2014లో 'రామానుజన్' చిత్రంలో నటించారు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత 'హ్యాపీ రాజ్' చిత్రం ద్వారా తమిళ సినిమాలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్బాస్ ఇకపై సినిమాల్లో నటిస్తూనే ఉండాలని ఆసక్తి చూపుతున్నారు. 1999లో మాత్రమే అతను తమిళం, తెలుగు, మలయాళంలో 8 చిత్రాల్లో నటించారు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో నివసిస్తున్న అబ్బాస్ ఇప్పుడు మళ్ళీ సినీ రంగంలోకి తిరిగి వచ్చారు.





















