YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
Happy Birthday to YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు (#HBDYSJagan) నేడు. మాజీ సీఎం బర్త్ డే సందర్భంగా వైఎస్ జగన్ కి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
Birthday greetings to Shri @ysjagan Garu. May he be blessed with a long and healthy life.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2025
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
శ్రీ వై ఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 21, 2025
మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
జగన్‌కు షర్మిల విషెస్..
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే సోదరుడు అని, అన్నయ్య అని పేర్కొంటే బాగుండేదని వైఎస్సార్ ఫ్యాన్స్, జగన్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.
జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు..
"సంకల్పానికి మారుపేరు.. విశ్వసనీయతకు నిలువుటద్దం.. మా ఆరాధ్య దైవం @ysjagan అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాక్షేత్రంలో మీరు మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 20, 2025
జై జగన్! ✊ pic.twitter.com/4wST3te2HB
"సంకల్పానికి మారుపేరు వైఎస్ జగన్.. విశ్వసనీయతకు నిలువుటద్దం.. మా ఆరాధ్య దైవం జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాక్షేత్రంలో మీరు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా విషెస్ తెలిపారు.
హ్యాపీ బర్త్‌డే జగన్ గారు.. విజయసాయిరెడ్డి ట్వీట్
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. ప్రజా సేవలో మీకు మరింత శక్తి, విజయం లభించాలని కోరుకున్నారు.
Warm birthday wishes to Shri @ysjagan Garu, Former Chief Minister of Andhra Pradesh and President of YSRCP.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2025
May you be blessed with good health, happiness, strength and success in the service of the people. pic.twitter.com/4v07UjYKa2
ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన శుభాకాంక్షలు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్‌కు విషెస్ తెలిపారు.
మాజీ మంత్రి విడదల రజనీ విషెస్..
Warm birthday wishes to our leader, @ysjagan anna.
— Rajini Vidadala (@VidadalaRajini) December 21, 2025
Your courage in the face of adversity, your unwavering commitment to the poor, and your belief in governance with compassion continue to inspire us every day.
Under your leadership, politics found purpose and administration… pic.twitter.com/T1b83U39EK
తెలంగాణ డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని విషెస్ తెలిపారు.
Birthday greetings to former Andhra Pradesh Chief Minister Sri @ysjagan garu. Wishing him good health, happiness, and long life.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) December 21, 2025
జగన్‌కు కేటీఆర్ విషెష్..
వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
— BRS Party (@BRSparty) December 21, 2025
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి @ysjagan కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా… pic.twitter.com/Z3209lMMse






















