అన్వేషించండి
తల నీలాల నుంచి అన్నం ప్రసాదం వరకు.. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి 6 ఆసక్తికరమైన విషయాలు!
Tirupati Balaji Mandir Mystery: దక్షిణ భారతదేశంలోని తిరుపతి బాలాజీ ఆలయం భక్తితో పాటు రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
TTD News
1/6

దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.. తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం భక్తులకు విశ్వాసానికి కేంద్రంగా ఉండటమే కాకుండా అనేక రహస్యాలతో నిండి ఉంది. బాలాజీ ఆలయానికి సంబంధించిన ఈ రహస్యాలు మీకోసం..
2/6

కలియుగంలో విష్ణువు నివాసం తిరుమల అని నమ్మకం. అందుకే ఆలయంలో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందంటారు భక్తులు. తిరుపతి బాలాజీకి ప్రసాదంగా లడ్డూను సమర్పిస్తారు, కాని లడ్డూతో పాటు పెరుగు-అన్నం కూడా పెట్టే ఆచారం ఉంది.
3/6

తిరుపతి బాలాజీ ఆలయంలో తలనీలాలు సమర్పించే ఆచారం కూడా ఉంది. నమ్మకాల ప్రకారం, విష్ణువు కుబేరుడి నుంచి అప్పు తీసుకున్నాడు కలియుగం ముగిసే వరకు మొత్తం అప్పు తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఆ అప్పు తీర్చడానికి భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు తలనీలాలు సమర్పిస్తారు. భక్తులు తలనీలాలు సమర్పించడం అప్పు తీర్చే వాయిదాగా భావిస్తారు.
4/6

తిరుమల విగ్రహం చాలా ప్రత్యేకమైనది ..చాలా గొప్పది. విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు అలల శబ్దం వస్తుందని చెబుతారు. విగ్రహాన్ని లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరి రూపంగా భావిస్తారు
5/6

తిరుపతి బాలాజీ ఆలయం లోపల ప్రతిష్టించిన విగ్రహంపై నిజమైన వెంట్రుకలు ఉన్నాయి, అవి ఎప్పుడూ చిక్కుపడవు. వేసవి కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చెమట్లు పడతాయట
6/6

గుడిలో ఎల్లప్పుడూ ఓ దీపం వెలుగుతూనే ఉంటుంది... అందులో నెయ్యి లేదా నూనె వేయరు, కానీ అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపం అందరికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది
Published at : 05 Dec 2025 07:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















