Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Akhanda 2 Tickets Booking Hyderabad: 'అఖండ' విడుదలకు 24 గంటల సమయం లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. 'హరిహర వీరమల్లు' టీమ్ చేసిన తప్పే ఇప్పుడు 'అఖండ 2' టీమ్ చేసిందా?

'అఖండ 2 తాండవం' విడుదలకు ఇంకా 24 గంటల సమయం కూడా లేదు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు సనాతన ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కనుక కొందరు భక్తులు సైతం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అంచనాలపై నిర్మాతలు నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటి వరకు (డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు) నైజాం (తెలంగాణ)లో టికెట్స్ ఓపెన్ కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు.
గవర్నమెంట్ జీవో కోసం వెయిటింగ్!
'అఖండ 2' టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బెనిఫిట్ షోస్ / పెయిడ్ ప్రీమియర్ షోస్ టికెట్ రేటు 600 రూపాయలుగా నిర్ణయించింది. పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100 ఆల్రెడీ ఉన్న టికెట్ రేటు మీద పెంచింది. అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేయలేదు. దాని కోసం 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు రామ్ ఆచంట & గోపి ఆచంట వెయిట్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం జీవో ఇవ్వని కారణంగా నైజాం ఏరియాలో 'అఖండ 2' బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అభిమానులతో ప్రేక్షకులు సైతం ఈ విషయంలో డిజప్పాయింట్ అవుతున్నారు.
వీరమల్లుకూ ఇంతే... సేమ్ రిస్క్ మళ్ళీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో రావడం ఆలస్యం కావడం వల్ల విడుదలకు ముందు రోజు ఉదయం బుకింగ్స్ ఓపెన్ చేశారు. వరల్డ్ వైడ్ రిలీజ్ కంటే 24 గంటల ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు అలా కాలేదు. వంద రూపాయల టికెట్ రేటు పెంపు కోసం టోటల్ బుకింగ్స్ రిస్క్ చేశారని ట్రేడ్ వర్గాలతో పాటు వీరాభిమానులు భావిస్తున్నారు.
తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఉంటే వీకెండ్ వరకు చాలా షోస్ హౌస్ ఫుల్ అయ్యేవి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు అసలుకు ఎసరు వచ్చే సమస్య ఉంది. 14 రీల్స్ సంస్థ తమకు 27 కోట్లు ఇవ్వాలని, ఆ డబ్బులు వచ్చేవరకు సినిమా విడుదల మీద స్టే ఇవ్వాలని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హై కోర్టుకు వెళ్లడం, కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ రావడం వల్ల బుకింగ్స్ ఓపెన్ కాలేదనేది మరో టాక్.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!





















