Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై మరోసారి చర్చ మొదలయింది. ఈ విషయం గురించి మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ప్రస్తావించారు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై కీలక వ్యాఖ్యలు చేసారు.
2025 ప్రారంభంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సైతం సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే ఈ విషయంపై రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. ఈ ఇద్దరి రిటైర్మెంట్ అంత నేచురల్ గా అనిపించలేదని అన్నారు. రోహిత్, కోహ్లీ ఈ నిర్ణయం బలవంతంగా తీసుకున్నారని చెప్పడం లేదు, కానీ అది జరిగిన తీరు సమయం వారు సొంతంగా, ఇష్టపడి రిటైర్మెంట్ పలికినట్లు అనిపించలేదు. అసలు నిజం ఏమిటో విరాట్, రోహిత్ మాత్రమే చెప్పగలరని ఉతప్ప అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఫామ్ బాగా లేదని, అయితే కొద్దికాలం విరామం తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి తిరిగి వస్తాడని తాను భావించానని మాజీ సహచరుడు ఉతప్ప అన్నారు. "విరాట్, రోహిత్ ఇద్దరి కళ్ళలో మళ్ళీ అదే కసి కనిపిస్తోంది. ఇంత పెద్ద కెరీర్ తర్వాత కూడా వారిలో ఆటపట్ల అంత అభిరుచిని చూడటం చాలా బాగుంది" అన్నాడు ఉతప్ప.




















