Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!
Akhanda 2 Review Telugu: డిసెంబర్ 4వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్లతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' విడుదల కానుంది. ఆర్ఆర్ కంప్లీట్ చేసి కాపీలు డెలివర్ చేశాక తమన్ రివ్యూ ఇచ్చారు.

Balakrishna Akhanda 2 First Review Telugu: డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి అటు అమెరికాలో, ఇటు ఏపీలో పెయిడ్ ప్రీమియర్ షోలతో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ కాపీలు అన్ని ఏరియాలకు పంపించారు. సినిమాకు ఆర్ఆర్ (బ్యాగ్రౌండ్ మ్యూజిక్) కంప్లీట్ చేశాక తమన్ ఒక ట్వీట్ చేశారు. కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ రేంజ్‌లో ఎమోజీలతో ట్వీట్ చేశారు.
'అఖండ 2'కు తమన్ రివ్యూ...
సినిమా గురించి ఏం చెప్పారంటే?
Thaman Reviews Akhanda 2: దర్శకుడు బోయపాటి శ్రీను సహా ఆర్ఆర్ వర్క్స్ చేసిన టెక్నీషియన్లతో దిగిన ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో తమన్ షేర్ చేశారు.
''ఓం నమః శివాయ. జై అఖండ. ఈసారి గర్జన (నట సింహం నందమూరి బాలయ్య నటన, అఖండ సినిమా) మరింత బలంగా, పెద్దగా, శక్తివంతంగా ఉండబోతుంది. ఆ శివుని తన్మయత్వంలోకి వెళ్ళడానికి అంతా సిద్ధమైంది. గెట్ రెడీ'' అని 'ఎక్స్'లో తమన్ పేర్కొన్నారు. అయితే... పదాల మధ్యలో ఆయన ఇచ్చిన ఎమోజీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గెట్ రెడీ అన్నాక స్పీకర్స్ ఎమోజీలు షేర్ చేశారు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ వేడుకలో స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోమని తమన్ చెప్పిన సంగతి తెలిసిందే.
'అఖండ 2 తాండవం' హ్యాష్ ట్యాగ్ తర్వాత ఫైర్, గన్, బాంబు, త్రిశూలం ఎమోజీలు షేర్ చేశారు తమన్. విజయం తథ్యమని, గురి తప్పదన్నట్టు ఆయన చెప్పారు.
Also Read: Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
AUM NAMA SHIVAYA 🔱🔥 !!
— thaman S (@MusicThaman) December 3, 2025
JAI AKHANDA 📈
THE ROAR IS
BIGGER MIGHTIER STRONGER
ALL SET FOR A TRANCE OF SHIVA 🔱🙌🏿💪🏾
Get ready 🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🙏#Akhanda2Thaandavam 🔥🔫💣🔱 pic.twitter.com/lle8JGXlYP
'అఖండ 2' బుకింగ్స్ మొదలు
Akhanda 2 bookings opened: 'అఖండ 2 తాండవం' టికెట్ రేట్స్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అక్కడ బుకింగ్స్ మొదలు అయ్యాయి. తెలంగాణాలో ఇంకా బుకింగ్స్ మొదలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుతూ జీవో జారీ చేస్తుందని తెలిసింది. అది వచ్చాక తెలంగాణలో బుకింగ్స్ మొదలు అవుతాయి.




















