Akhanda 2 Controversy: 'అఖండ 2' నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్... విడుదలకు ముందు వివాదం!
Akhanda 2 Release Issue: 'అఖండ 2' విడుదలకు కొన్ని గంటలకు ముందు ఎరోస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సినిమా విడుదల చేయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళింది. ఆ వివాదంలోకి వెళితే...

Akhanda 2 Release Controversy - 14 Reels Plus Vs Eros International: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయి. చిత్ర నిర్మాతలు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ షాక్ ఇచ్చింది. అసలు ఆ వివాదం ఏమిటి? చెన్నై హైకోర్టులో కేసు ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
'అఖండ 2' విడుదలపై కోర్టు స్టే...
'వన్ నేనొక్కడినే' విడుదల వివాదం!?
Stay On Akhanda 2 Release: 'అఖండ 2' విడుదలపై తమిళనాడులో మద్రాస్ హై కోర్టు స్టే ఇచ్చిందని 'మనీ కంట్రోల్' వెబ్ సైట్ పేర్కొంది. చెన్నై వర్గాలు సైతం ఆ స్టే నిజమేనని పేర్కొన్నాయి. డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్ షోలతో 'అఖండ 2' విడుదలకు రెడీ అయిన నిర్మాతలకు డిసెంబర్ 3వ తేదీ నైట్ ఈ తీర్పు రావడం పిడుగు లాంటి వార్త అని చెప్పాలి.
Akhanda 2 Review Telugu: 'అఖండ 2' విడుదలపై మద్రాస్ హై కోర్టు స్టే (Madras High Court) ఇవ్వడానికి కారణం బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమకు 28 కోట్ల రూపాయలు ఇవ్వాలని, తమ డబ్బులు తమకు ఇచ్చేవరకు సినిమా విడుదల మీద స్టే ఇవ్వాలని కోరింది.
'అఖండ 2'ను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించలేదు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. అయితే... 14 రీల్స్‌లో రామ్ ఆచంట, గోపి ఆచంట సైతం భాగస్వామ్యులు. 14 రీల్స్ నుంచి వచ్చి 14 రీల్స్ ప్లస్ స్టార్ట్ చేసి 'అఖండ 2' చేశారని, అందువల్ల వాళ్ళు తమకు డబ్బులు ఇవ్వాలని పేర్కొంది. అందుకు కోర్టు కన్వీస్ అయ్యింది. 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలకు 14 రీల్స్, ఎరోస్ సంస్థలు కలిసి పని చేశాయి. ఆ సినిమాల సమయంలో జరిగిన ఒప్పందాలు - అప్పుడు వచ్చిన నష్టాలను ఇప్పుడు భర్తీ చేయాలని ఎరోస్ కోర్టుకు వెళ్ళింది.
సరిగ్గా విడుదలకు ముందు కోర్టుకు!
'అఖండ 2'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి 14 రీల్స్ ప్లస్ రెడీ అయ్యింది. సరిగ్గా సినిమా విడుదలకు ముందు టైం చూసి షాక్ ఇచ్చింది ఎరోస్ సంస్థ. డిసెంబర్ 4న అవుటాఫ్ కోర్టు సెటిల్‌మెంట్ జరగొచ్చని, విడుదలకు అసలు ఎటువంటి అడ్డంకి ఉండదని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!





















