అన్వేషించండి

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

Water Dispute: తెలంగాణకు నీటి అన్యాయం జరగడానికి కేసీఆరే కారణం అని రేవంత్ ఆరోపించారు. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృష్ణా, గోదావరి నీటి అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Telangana CM Revanth Reddy: నీటి కేటాయింపులపై కేసీఆర్​ చేసిన సంతకం తెలంగాణ కొంప ముంచిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  విమర్శించారు. గురువారం ప్రజాభవన్​ లో ప్రజా ప్రతినిధులకు కృష్ణా, గోదావరి బేసిన్​ అంశాలపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇచ్చాడు. దీని సీఎం హాజరై అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్​, చంద్రబాబు సీఎంలు అయ్యాకా నీటి అంశాలపై చాలా ఇబ్బందులు వచ్చాయని..  కృష్ణా నికర జలాలకు సంబంధించి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు.  అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, రెండు రాష్ట్రాల సీఎంల చర్చలలో 34:66 నిష్పత్తికి కేసీఆర్​ ఒప్పందం చేసుకున్నారన్నారు. తొలుత ఒక సంవత్సరానికి అని చెప్పి ఆ తర్వాత వరుసగా పొడిగిస్తూ 2020లో ట్రిబ్యునల్ ఫైనల్ చేసేంత వరకూ ఇదే ఫార్ములా ఉంటుందని కేసీఆర్​ సంతకం చేశారని  వివరించారు.  దీంతో శాశ్వతంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందని రేవంత్ మండిపడ్డారు.  

2004లో ఏర్పడిన  ట్రిబ్యునల్ విచారణకు సంబంధించి 2026 వచ్చినా తీర్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒప్పందంతో ఏపీకి మంచి అవకాశంగా కలిసొచ్చినట్లయిందని.. దీంతో ఈ నీటిపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నారని వెల్లడించారు. ఇ పరివాహక ప్రాంతం ఎంత ఉంటుందో అంత మేరకు నీట వాటా దక్కాలన్నది అంతర్జాతీయ సూత్రం అని చెప్పారు. దీని ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు  కావాలని చెప్పామన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించాల్సింది పోయి.. శ్రీశైలం నుంచి తీసుకునేందుకు డిజైన్ మార్చారన్నారు. దాని వల్ల తీవ్ర నష్టం జరిగిందని..ఎత్తిపోతల నిర్మిస్తేనే కమిషన్లు వస్తాయని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 

అసెంబ్లీ, లోక్​ సభ ఎన్నికలల్లో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడిపోయిందని.. వరుస ఓటములతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్​ గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా మళ్లీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జలవివాదాలు సృష్టించి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే సంకుచిత స్వభావం ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, కృష్ణా-గోదావరి జలాల విషయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిపై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు.
 
2014 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కేటాయింపులపై లోతైన విశ్లేషణ చేశారు. గత పదేళ్లలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. "మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇందులో ఎటువంటి జాప్యం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని, విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, రాష్ట్ర పురోగతిని అడ్డుకునేలా ఉండకూడదని ఆయన సూచించారు.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పానన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదన్నారు.అయినప్పటికీ తాము అన్ని డాక్యుమెంట్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget