అన్వేషించండి

Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?

Loan Apps : డేటా మిస్ యూజ్ చేస్తున్న లోన్ యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. వీరు లోన్లు ఇచ్చి వేధింపులు, ఫ్రాడ్‌కు పాల్పడుతున్నట్లుగా తేల్చారు.

Indian Government Bans 87 Loan Apps Over Data Misuse :  ప్రజలను చట్టవిరుద్ధ కార్యకలాపాలతో వేధిస్తూ, సైబర్ మోసాలు, డేటా దుర్వినియోగం, అధిక వడ్డీ దోపిడీలకు పాల్పడుతున్న 87 అనధికార డిజిటల్ లోన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లను బ్లాక్ చేసినట్లు మంత్రి ఆఫ్ స్టేట్ ఫర్ కార్పొరేట్ అఫైర్స్ హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ,  ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కలిసి చేపట్టిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.  

ప్రజల్ని పట్టి  పీడిస్తున్న లోన్ యాప్ లు - ఒక్క సారి లోన్ తీసుకుంటే వేధింపులే           

గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ లోన్ యాప్‌లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా అధిక వడ్డీలు వసూలు చేసుకోవడం, రుణాలు తిరిగి చెల్లించకపోతే బాధితుల కుటుంబ సభ్యులను వేధించడం, వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ యాప్‌లు RBI మార్గదర్శకాలను పాటించకుండా, ఆక్రమణాత్మక రికవరీ పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఫిర్యాదులు పెరగడంతో కేంద్రం సమగ్ర సమీక్ష చేపట్టింది.                

చైనీస్ లోన్ యాప్ ల వేధింపులు - గతంలోనే కేంద్రం చర్యలు                                     

2024లోనే RBI , కేంద్రంతో కలిసి 665 చైనీస్ లోన్ యాప్‌లపై విచారణ ప్రారంభించాయి. ఈ యాప్‌లు ప్రజల ఫోటోలు, కాంం‌టాక్ట్ లిస్ట్‌లను మోసపూరితంగా సేకరించి, రుణాలు చెల్లించకపోతే బెదిరింపులు చేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలతో  కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.  RBI డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు (2022) ప్రకారం, అన్ని లోన్ యాప్‌లు RBI నుంచి అనుమతి పొందాలి. కానీ ఈ 87 యాప్‌లు ఈ నిబంధనలను ఉల్లంఘించాయి.                   

మరింత కఠినంగా లోన్ యాప్స్ పై పర్యవేక్షణ                         

కేంద్రం ఇకపై డిజిటల్ లోన్ యాప్‌లపై మరింత కఠిన పర్యవేక్షణ అమలు చేయనుంది. ఇందులో డేటా ప్రైవసీ, రికవరీ పద్ధతులు, వడ్డీ రేట్లపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు.   ఈ యాప్‌లు అప్పు తీసుకున్న అనేక మంది జీవితాల్ని నరకం చేశాయి.  2022లో RBI 27 యాప్‌లపై చర్యలు తీసుకుంది, 2023లో మరో 50 యాప్‌లను బ్లాక్ చేసింది. ఈసారి 87 యాప్‌లను బ్లాక్ చేశారు. ఈ యాప్ లకు బాకీ ఉన్నవారు ఇక కట్టాల్సిన అవసరం ఉండదు. వారి యాప్స్ ను బ్లాక్ చేశారు కాబట్టి కమ్యూనికేషన్ కూడా ఉండదు. 


 

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget