Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Revolver Rita OTT Platform : కీర్తి సురేష్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Keerthy Suresh's Revolver Rita OTT Release Date Lokced : 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'రివాల్వర్ రీటా' డిజిటల్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'రీటా తన కుటుంబంతో గొడవ పడితే రివాల్వర్ రీటా అవుతుంది.' అంటూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ అందుబాటులోకి రానుంది.
ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించగా... కీర్తి సురేష్‌తో పాటు రెడిన్ కింగ్స్‌లీ, రాధికా శరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్, సూపర్ సుబ్బరాయన్, సెండ్రయాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళని స్వామి సంయుక్తంగా మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : 'ది రాజా సాబ్' బిజినెస్‌పై రూమర్స్ - ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్
స్టోరీ ఏంటంటే?
పాండిచ్చేరిలోని ఓ ఫ్రైడ్ జాయింట్ షాప్‌లో రీటా (కీర్తి సురేష్) పని చేస్తుంటుంది. తల్లి చెల్లెమ్మ (రాధికా శరత్ కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో ఉంటుంది. ఇదిలా ఉండగా డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అతన్ని మర్డర్ చేసి తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) ఓ ముఠాతో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో భాగంగా పాండ్యన్‌ను హనీ ట్రాప్ చేసేందుకు ప్రణాళిక రచించగా... డ్రగ్స్ మత్తులో ఒక ఇంటికి వెళ్లబోయి పొరపాటున పక్క వీధిలో ఉన్న రీటా ఇంటికి వెళ్తాడు.
అక్కడ అనుకోకుండా జరిగిన గొడవలో రీటా తల్లి చెల్లెమ్మ కొట్టిన దెబ్బకు పాండ్యన్ చనిపోతాడు. తండ్రి కనిపించకపోవడంతో కొడుకు బాబీ (సునీల్) అతని కోసం వెతకడం మొదలుపెడతాడు. అసలు పాండ్యన్ చనిపోయిన విషయం అతనికి తెలిసిందా? తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రీటా ఏం చేసింది? మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడింది? అసలు పాండ్యన్ నర్సింహారెడ్డి మధ్య గొడవ ఏంటి? ఒప్పందం చేసుకున్న ముఠా ఏం చేసింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















