Varanasi Budget : రాజమౌళి 'వారణాసి' బడ్జెట్ - ప్రియాంక చోప్రా రియాక్షన్... ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!
Priyanka Chopra : మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' మూవీ బడ్జెట్ ఎంత? గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. తాజాగా ఈ మూవీ బడ్జెట్‌పై ప్రియాంక చోప్రా నోరు విప్పారు.

Priyanka Chopra About Rajamouli Varanasi Movie Budget : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వారణాసి'. ఈ మూవీ బడ్జెట్ ఎంత? అనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే సాగింది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తుండగా... కరెక్ట్ ఫిగర్‌పై క్లారిటీ రాలేదు. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా స్పందించారు.
మూవీ బడ్జెట్ ఎంతంటే?
'ది కపిల్ శర్మ షో'లో తాజాగా కనిపించిన ప్రియాంక చోప్రా తాజాగా దీనిపై రియాక్ట్ అయ్యారు. ''వారణాసి' సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. మీరు ఆ సినిమాలోకి వచ్చినప్పటి నుంచీ బడ్జెట్ పెరిగింది. ఇది నిజమేనా?' అని కపిల్ శర్మ ప్రియాంకను అడగ్గా... 'మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? బడ్జెట్‌లో సగం నా బ్యాంక్ ఖాతాలోకే పోయింది' అంటూ నవ్వులు పూయించారు. 'వారణాసి' బడ్జెట్ రూ.1300 కోట్లా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ అని... హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్‌కు ఆ మాత్రం బడ్జెట్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్‌లో కూడా ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం 'వారణాసి' భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రెండో సినిమాగా నిలిచింది. నితీష్ తివారీ 'రామాయణం పార్ట్ 1' దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
#KapilSharma: We’ve heard #Varanasi film’s budget is ₹1,300 crores. Since you came on board the budget has increased. Is this true?#PriyankaChopra: “WHAT ARE YOU TRYING TO SAY? HALF OF THE BUDGET HAS GONE TO MY BANK ACCOUNT.”#SSRajamouli | #MaheshBabu pic.twitter.com/XhZPVLKO15
— Whynot Cinemas (@whynotcinemass_) December 20, 2025
Also Read : రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' సర్ ప్రైజ్ - పవర్ ఫుల్ లుక్‌లో కియారా
ఎవరి రెమ్యునరేషన్ ఎంత?
డైరెక్టర్ రాజమౌళి ఏ మూవీకైనా మూవీ లాభాల్లో వాటా తీసుకోవడం అలవాటు. ఇప్పుడు 'వారణాసి' మూవీకి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన చేసే ఏ ప్రాజెక్టుకైనా ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తుంది. ఈ మూవీకి జక్కన్న నెలకు ఇంత చొప్పున జీతం తీసుకుని... సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో 50 శాతం తీసుకుంటారని సమాచారం. ఇక మహేష్ బాబు... ఏడాదికి ఇంత చొప్పున సినిమా పూర్తయ్యే వరకూ కొంత ఇవ్వాలని మాట్లాడుకున్నారట.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు ఫిక్స్‌డ్ అమౌంట్ రెమ్యునరేషన్‌గా ఇవ్వనున్నారట. ఈ మూవీలో విలన్ 'కుంభ'గా పృథ్వీరాజ్ చేస్తుండగా... మందాకిని పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. శ్రీరాముడిగా, రుద్రగా మహేష్ బాబు నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2027 మార్చిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















