Toxic Movie : రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' సర్ ప్రైజ్ - పవర్ ఫుల్ లుక్‌లో కియారా
Kiara Advani : రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి కియారా అడ్వాణీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Kiara Advani's First Look From Yash Toxic Movie : రాకింగ్ స్టార్ యష్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. హీరోయిన్ కియారా అడ్వాణీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
పవర్ ఫుల్ రోల్
మూవీలో కియారా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర పేరు నదియా కాగా... వేరే గ్రహం నుంచి నేలకు దిగి వచ్చిందా అనేలా సీరియస్‌గా ఉన్న లుక్ అదిరిపోయింది. 'కియారా క్రూరంగా క్షమించనదిగా కనిపిస్తుంది. థియేటర్లలో పవర్ ఫుల్, లేయర్డ్ పెర్ఫార్మెన్స్‌ను ఆశించండి' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : 'ది రాజా సాబ్' బిజినెస్‌పై రూమర్స్ - ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... హాలీవుడ్ స్థాయికి దీటుగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన యష్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కరీనా కపూర్, నయనతార, శ్రుతి హాసన్ తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే మిగిలిన హీరోయిన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇది పెద్దలకు సందేశమిచ్చే చిత్రమని హీరో యశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే 'ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ట్యాగ్ లైన్ పెట్టామని చెప్పారు. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో మూవీ తెరకెక్కుతుండగా... హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.





















