Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
Shubman Gill Dropped T20 World Cup 2026: | శుభమన్ గిల్ T20 ప్రపంచ కప్ 2026 భారత జట్టులో సభ్యుడు కాదని అతడికి కనీసం తెలియదని బయటకు వచ్చింది. ఫామ్ లేమిపై గిల్‌తో చర్చించలేదని తెలుస్తోంది..

T20 world cup 2026 | వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ 2026 కోసం బీసీసీఐ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. BCCI కార్యదర్శి దేవ్జీత్ సైకియా శనివారం ప్రకటించిన టీమిండియా జాబితాలో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పేరు లేదు. దానికి ముందు న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం గిల్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం భారత టెస్ట్, ODI జట్టు కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్ వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్‌లో ఆడటం లేదు. ప్రిన్స్ ఫ్యాన్స్ ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఫాం తాత్కాలికమేనని, అతడు క్లాస్ ప్లేయర్ అని మద్దతు తెలిపారు. అసలు పరుగులు చేయకుండా, జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్ యాదవ్ ను మాత్రం ఎలా ఎంపిక చేశారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
శుభ్‌మన్ గిల్‌కు విషయం చెప్పలేదా..
T20 జట్టు నుండి తనను తొలగించినట్లు శుభ్‌మన్ గిల్‌కు ఎవరూ తెలియజేయలేదు అనే అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. పలు మీడియాలలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, BCCIకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం జట్టు నుండి తొలగిస్తున్నట్లు శుభ్‌మన్ గిల్‌కు ముందుగా తెలియజేయలేదని తెలిపారు. కనీసం గిల్‌తో ఈ విషయంపై డిస్కషన్ కూడా చేయలేదని స్పష్టమైంది. మరోవైపు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, కనీసం ప్రపంచ కప్ వరకు అతడి కెప్టెన్సీ కొనసాగనుంది. తక్కువ సమయంలో ప్రయోగాలు ఎందుకని బీసీసీఐ భావించింది.
చివరి టీ20 ఆడాలనుకున్న గిల్.. కానీ
నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్ సమయంలో శుభ్‌మన్ గిల్‌కు కాలికి గాయం అయినప్పుడు, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ గిల్ కోసం ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించిందని వార్తలు వచ్చాయి. గిల్ అహ్మదాబాద్‌లో జరిగిన ఐదవ T20 మ్యాచ్ ఆడాలనుకున్నారని తెలుస్తోంది. అయితే అంతకు ముందే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని టీ20 జట్టు నుండి, వరల్డ్ కప్ నుంచి తొలగించాలని ప్లాన్ చేసిందని తెలిసింది. అంటే గిల్‌కు తెలియకుండానే, అతడితో కనీసం డిస్కషన్ కూడా చేయకుండా వన్డే, టెస్టు కెప్టెన్‌ను జట్టు నుండి తొలగించారని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
చిన్నగాయమే.. కానీ ఛాన్స్ దొరికిందని పక్కన పెట్టేశారా..
శుభ్‌మన్ గిల్ గాయం ఫ్రాక్చర్ అయి ఉండవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే మెడికల్ టీమ్ పరీక్షలో గిల్ గాయం అంత తీవ్రమైనది కాదని గుర్తించింది. అటువంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాతో ఐదవ T20 మ్యాచ్ గిల్ ఆడగలిగేవాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గిల్‌ను డ్రాప్ చేయడంపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని గమనించాలి. ఇదే క్రమంలో జనవరిలో న్యూజిలాండ్ తోొ జరిగే టీ20 సిరీస్‌కు, టీ20 వరల్డ్ కప్‌నకు గిల్ ను ఎంపిక చేయలేదు. రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్, జితేష్ శర్మ, సిరాజ్ లాంటి ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.





















