MS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP Desam
టీమిండియా క్రికెట్ ఫాలో అయ్యే వాళ్లైవరికైనా తెలిసింది ఏంటంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఫోన్ వాడటానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడని. గతంలో చాలా మంది క్రికెటర్లు చెప్పేవాళ్లు ధోనితో ఫోన్ లో కాంటాక్ట్ కాలేము అతన్ని కావాలంటే నేరుగా కలవాల్సిందే అని. అలాంటి ధోని ప్రాక్టీస్ సెషన్ మధ్యలో ఫోన్ ఆపరేట్ చేస్తూ కనిపించాడు. చాలా రేర్ సైట్ ఇది. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ధోనీ...43ఏళ్ల వయస్సులో ఈసారి మరింత ఫిట్ గా కనిపిస్తున్నాడు. కండలు దిట్టంగా పెంచి ఈ ఏజ్ లోనూ ఫిట్ గా ఉండేలా ట్రై చేస్తున్నాడు. గత సీజన్ లో సీఎస్కే ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయకపోవటంతో ఈసారి మాహీ నుంచి మ్యాజిక్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మే బీ ఇదే ధోనికి ఆఖరి సీజన్ ఏమో అనే ప్రచారం కూడా ఎప్పట్లానే షరా మాములుగా నే జరుగుతోంది





















