అన్వేషించండి

Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్

India vs England, 2nd Semi-Final: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా భారీ టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగులు చేసింది.

Highest Team Total in T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 253 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరో ఓపెనర్ అభిషేక్ విఫలమైనా సంజూ శాంసన్ 89 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే, తిలక్ వర్మ, పాండ్యాలు తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోరు చేసి ఇంగ్లాండ్ కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చింది. 

భారత్ అత్యధిక స్కోరు రికార్డు

టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2012 వరల్డ్ కప్‌లో పటిష్ట ఆస్ట్రేలియాపై 205 పరుగులు చేసింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో 200 కంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్లు భారత్, వెస్టిండీస్ మాత్రమే.

విరాట్ సరసన శాంసన్ 

ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ, భారత జట్టు రన్-రేట్ తగ్గకుండా సంజు శాంసన్ మరోసారి బాధ్యత తీసుకున్నాడు. శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ వరుసగా రెండో మ్యాచులో శతకం చేజారింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సంజూ శాంసన్ శామ్సన్, విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో శాంసన్‌కు ఇది వరుసగా రెండో అర్ధశతకం.

భారత్ ఇన్నింగ్స్..

2వ ఓవర్‌కే అభిషేక్ శర్మ (9) ఔటైనా ఇషాన్ కిషన్ తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన్ సైతం సంజూతో పోటీ పడి వేగంగా పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆ తరువాత తిలక్ వర్మ, సూర్య కుమార్ కు బదులుగా శివం దుబే బ్యాటింగ్ కు వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సంజూ  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో సంజూ శాంసన్ (42 బంతుల్లో 89, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 13.1 ఓవర్లలో  160. 

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11) విఫలమైనప్పటికీ శివం దుబే, హార్ధిక్ పాండ్యా రన్ రేట్ తగ్గకుండా చూశారు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి శివం దుబే (25 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 212/5 .హార్దిక్ కాల్ చేయడంతో ఈ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. తరువాత తిలక్ వర్మ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు బాది, అదే ఓవర్లో బౌల్డయ్యాడు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) కీలకమైన పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో పరుగులకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ , ఆదిల్ రషీద్ చెరో 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. కానీ భారత బ్యాటర్ల ధాటికి ఇంగ్లీష్ బౌలర్లు పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చిన విల్ జాక్స్ బౌలింగే బెస్ట్ యావరేజ్ కావడం విశేషం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget