భారత క్రికెట్ జట్టు ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్ రెండు టెస్టు మ్యాచ్‌లతో కూడి ఉంటుంది.
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. గాయం నుండి కోలుకున్న రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు.

- శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు, గిల్ కెప్టెన్‌గా ప్రకటించారు.
- బ్రార్, సారాంశ్ జైన్ కొత్త ఆటగాళ్లు; బుమ్రా, సుందర్ అనుమానం.
- రెండు టెస్టులు ఆగస్టు 15, 23 తేదీల నుండి ప్రారంభం కానున్నాయి.
Ravindra Jadeja Selected for Sri Lanka Tour | ముంబై: భారత క్రికెట్ జట్టు ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం బిసిసిఐ (BCCI) మంగళవారం నాడు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. తొలి టెస్టు ఎంపికకు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేరని బోర్డు తెలిపింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా, అందులో ఇద్దరు ఆటగాళ్లు ప్లేయింగ్ 11లో ఉండటం వారి ఫిట్‌నెస్ రిపోర్ట్‌పై ఆధారపడి ఉంటుంది. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉండగా, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ కీపర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇటీవల వన్డేలో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌ను తొలిసారిగా టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు సారాంశ జైన్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ్ ఆఫ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందించనున్నాడు. అయితే సీనియర్ల రిటైర్మెంట్, కొందరు ఫామ్ కోల్పోవడంతో ఇటీవల వరుసగా కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశాలు వస్తున్నాయి.
🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced
— BCCI (@BCCI) July 28, 2026
Note: Washington Sundar was not available for selection for the first Test.
More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj
సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం COE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావడంపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో తెలిపింది. మొదటి టెస్టుకు సెలక్ట్ చేసిన వారిలో వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత స్క్వాడ్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది.
భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్
భారత్, శ్రీలంక మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్
మొదటి టెస్ట్: ఆగస్టు 15 నుండి 19 వరకు - గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
రెండో టెస్ట్: ఆగస్టు 23 నుండి 27 వరకు - సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ (SSC)
Before You Go
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Frequently Asked Questions
భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ ఎప్పుడు జరగనుంది?
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు కెప్టెన్ ఎవరు?
శుభ్‌మన్ గిల్ భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
శ్రీలంక టెస్టు సిరీస్‌కు కొత్త ఆటగాళ్లు ఎవరైనా ఎంపికయ్యారా?
అవును, ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, ఆల్‌రౌండర్ సారాంశ జైన్ తొలిసారిగా టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ ఆఫ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.
ఈ సిరీస్‌కు అందుబాటులో లేని లేదా ఫిట్‌నెస్‌పై ఆధారపడిన ఆటగాళ్లు ఎవరు?
వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో లేరు. సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటారు.
ట్రెండింగ్ వార్తలు




















