అన్వేషించండి

Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..

జింబాబ్వేపై జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 151 పరుగులతో సత్తా చాటాడు. 2 అర్ధసెంచరీలు సాధించడమే కాకుండా వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ చేసుకుని ఆకట్టుకున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
  • అతను రెండు అర్ధసెంచరీలు చేసి, మొత్తం 151 పరుగులు సాధించాడు.
  • తన తల్లి, రింకూ సింగ్ కోసం ప్రత్యేక సెలబ్రేషన్స్ వెల్లడించాడు.

Ind vs Zim T20 Series | జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. సిరీస్‌లోని మూడోదైన చివరి మ్యాచ్‌లో వైభవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌కుగానూ 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. వైభవ్ ఈ మూడు టీ20 మ్యాచ్‌లలో 2 అర్ధసెంచరీలు సాధించాడు. ఆ హాఫ్ సెంచరీ చేసిన తరువాత వైభవ్ సూర్యవంశీ ఒక ప్రత్యేకమైన రీతిలో వేడుకలు చేసుకున్నాడు. వైభవ్ ఎందుకలా చూపిస్తున్నాడు.. దాని గురించి తెలుసుకోవాలని క్రికెట్ ప్రేమికులు భావించారు. 

వైభవ్ సూర్యవంశీ చేసుకున్న సెలబ్రేషన్ వెనుక ఉన్న రహస్యమేమిటనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వేడుకల గురించి వండర్ కిడ్ వైభవ్ స్వయంగా వెల్లడించాడు. ఒక సెలబ్రేషన్ వెనుక రింకూ సింగ్ పాత్ర కూడా ఉందని వైభవ్ చెప్పాడు. 15 ఏళ్ల వైభవ్ తొలి హాఫ్ సెంచరీ తరువాత A అనే ఆకారాన్ని చూపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడో టీ20లో సెలబ్రేషన్‌లో వైభవ్ డబుల్ థంబ్స్ అప్ (రెండు బొటనవేళ్లు చూపిస్తూ) సెలబ్రేట్ చేసుకున్నాడు. 

తల్లి కోసం వైభవ్ చేసిన సెలబ్రేషన్

ఈ సెలబ్రేషన్ గురించి వైభవ్ సూర్యవంశీ బిసిసిఐ (BCCI)తో మాట్లాడుతూ ‘నేను మా అమ్మ కోసం ఈ సెలబ్రేషన్‌ను చేశాను. అమ్మ పేరు ఆర్తి. ఆమె పేరులో మొదటి అక్షరం A వచ్చేలా సెలబ్రేట్ చేశాను. రెండవ సెలబ్రేషన్‌ను రింకూ భయ్యాతో మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నాను. నేను నా ఈ అర్ధసెంచరీని నా కుటుంబానికి, నా కోచ్‌కి, నా జర్నీలో మంచి, చెడులోనూ నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం ఇస్తున్నాను. అందుకే థమ్స్ అప్ అని చూపించి సెలబ్రేట్ చేసుకున్నానని’ అన్నాడు.

జింబాబ్వేలో జోరుగా సాగిన వైభవ్ సూర్యవంశీ బ్యాట్

వైభవ్ జింబాబ్వే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సిరీస్ 3 మ్యాచ్‌ల 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేస్తూ 50.33 సగటు, ఏకంగా 196.10 స్ట్రైక్ రేట్‌తో 151 పరుగులు సాధించాడు. మొదటి టీ20లో వైభవ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. వైభవ్‌కు ఇది తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిఫ్టీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా సైతం తన ఖాతాలో రికార్డు వేసుకున్నాడు. 

Read Also: Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

రెండవ టీ20 మ్యాచ్‌లో వైభవ్ త్వరగా ఔటయ్యాడు. కానీ తక్కువ బంతుల్లోనే 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. వైభవ్ 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత చివరిదైన మూడవ వైభవ్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ 15 ఏళ్ల భారత బ్యాటర్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఎన్నో డిమాండ్లు, ఎన్నో ఆశల తరువాత వైభవ్ ఇటీవల అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్ లో అంతగా రాణించని వైభవ్ సూర్యవంశీ రెండో సిరీస్‌లో సత్తాచాటాడు.

Frequently Asked Questions

జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. మూడో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్‌లో ఎన్ని పరుగులు సాధించాడు?

వైభవ్ ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 151 పరుగులు చేశాడు, ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని సగటు 50.33 మరియు స్ట్రైక్ రేట్ 196.10.

వైభవ్ సూర్యవంశీ సాధించిన ప్రత్యేక రికార్డు ఏమిటి?

15 ఏళ్ల వైభవ్ తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీతో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిఫ్టీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ తన అర్ధసెంచరీ తర్వాత ఎలా వేడుకలు చేసుకున్నాడు?

మొదటి హాఫ్ సెంచరీ తర్వాత 'A' ఆకారాన్ని చూపించాడు, ఇది తన తల్లి కోసం అన్నాడు. మూడో టీ20లో డబుల్ థంబ్స్ అప్ చూపించి రింకూ సింగ్ పాత్ర ఉందని చెప్పాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget