అన్వేషించండి

PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే

PCOS and Iron Deficiency : PCOS ఉన్న మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా వస్తుందా? ఈ లోపం రావడానికి కారణాలు ఏంటి? గైనకాలజిస్ట్ ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PCOS, ఐరన్ లోపం మహిళల్లో తరచుగా కనిపించే ప్రధాన సమస్యలు.
  • అధిక రుతుస్రావం కారణంగా PCOS రోగులకు ఐరన్ లోపం వస్తుంది.
  • అలసట, నెలసరి మార్పులు లక్షణాలు; సమతుల్య జీవనశైలితో నియంత్రణ.
  • ప్రారంభ నిర్ధారణ, చికిత్స దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

PCOS Risks of Iron Deficiency : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఐరన్ లోపం (Iron Deficiency) ప్రధానమైనవి. ఈ రెండు సమస్యలకు వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు రెండూ ఒకేసారి కనిపించవచ్చు. ఇవి శరీరంలో శక్తి స్థాయిలు, హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తి సామర్థ్యం, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గైనకాలజిస్ట్ సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

"PCOS ఉన్న ప్రతి మహిళలో ఐరన్ లోపం ఉంటుందని భావించడం సరైంది కాదు. అయితే కొందరిలో అధిక రుతుస్రావం కారణంగా ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలను బట్టి వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం" అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ప్రసూతి, గైనకాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ ఎం.వి. జ్యోత్స్న తెలిపారు.

Also Read : ఊబకాయం వల్ల అమ్మాయిలకు పీరియడ్స్ త్వరగా వచ్చేస్తాయా? మరి మగపిల్లలకు? నిపుణుల సూచనలివే

PCOS ఉన్నవారికి ఐరన్ లోపం ఎందుకు వస్తుంది?

PCOS ఉన్న కొందరు మహిళల్లో పీరియడ్స్​లో చాలా మార్పులు ఉంటాయి. కొందరికి ఎక్కువ రోజులు కొనసాగడం లేదా అధిక రక్తస్రావంతో కూడిన పీరియడ్స్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి ఎక్కువ రక్తం కోల్పోవడం వల్ల ఐరన్ లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కొందరు మహిళలకు పీరియడ్స్ చాలా అరుదుగా రావచ్చు లేదా అసలు రాకపోవచ్చు. వీరిలో రుతుస్రావం వల్ల ఐరన్ లోపం వచ్చే అవకాశం తక్కువగా ఉన్నా.. పోషకాహార లోపం లేదా అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల ఐరన్ కొరత ఏర్పడవచ్చు.

ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు

మహిళల్లో ఐరన్ తక్కువగా ఉంటే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించడం, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, తల తిరగడం లేదా తరచూ తలనొప్పి రావడం, జుట్టు ఎక్కువగా రాలడం, గోర్లు పలుచగా మారడం లేదా సులభంగా విరిగిపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనిపై దృష్టి పెట్టలేకపోవడం, చిన్న పనులకే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Also Read : పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే

PCOS లక్షణాలు 

PCOS ఉంటే.. రుతుచక్రం సక్రమంగా ఉండదు. మొటిమలు ఎక్కువగా వస్తాయి. ముఖం, గడ్డం లేదా శరీరంపై వెంట్రుకలు పెరిగిపోతాయి. ముఖ్యంగా పొట్ట భాగంలో బరువు పెరగడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, ఇన్సులిన్ నిరోధకత కారణంగా మెడ, చంకల వద్ద చర్మం నల్లబడడం జరుగుతుంది. 

PCOS, ఐరన్ లోపం ఎలా నియంత్రించాలంటే..

PCOS, ఐరన్ లోపం రెండింటినీ నియంత్రించాలంటే జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యమని తెలిపారు డాక్టర్ జ్యోత్స్న. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఎక్కువ డైట్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. పప్పులు, బీన్స్, శనగలు, గుడ్లు, తక్కువ కొవ్వు ఉన్న మాంసాహారం ఆహారంలో చేర్చుకోవాలి. ఐరన్ శోషణను మెరుగుపరిచేందుకు నారింజ, ఉసిరి, జామ వంటి విటమిన్ C అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.

Also Read : ఆఫీస్‌లో పీరియడ్స్ సడెన్‌గా వస్తే? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

సమతుల్య ఆహారంతో పాటు.. వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. ఇవి PCOS లక్షణాలను నియంత్రిస్తాయి. అలాగే వైద్యులు సూచించిన చికిత్సను క్రమం తప్పకుండా పాటించాలి. వైద్యుల సూచనలు లేకుండా ఐరన్ టాబ్లెట్లు స్వయంగా తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. రక్త పరీక్ష ద్వారా నిజంగా ఐరన్ లోపం ఉందని తెలిస్తే.. వైద్యులే మీకు వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో సూచిస్తారు. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

తరచూ అలసట, అధిక రుతుస్రావం, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు లేదా PCOS లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. సరైన సమయంలో నిర్ధారణ, చికిత్స తీసుకుంటే లక్షణాలు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వంధ్యత్వం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

పీరియడ్స్​కి సంబంధించిన ఫుడ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget