అన్వేషించండి

Period Delay Pills : పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే

Menstrual Delay Tablets : పీరియడ్స్ ఆలస్యం చేసే ట్యాబ్లెట్స్ వాడితే ప్రాణాంతకమా? డాక్టర్ సలహా లేకుండా ఈ మాత్రలు వాడితే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైద్యుల సూచనతో అత్యవసరమైతేనే వాడాలి
  • వారానికి మించి వాడితే ఆరోగ్యానికి ప్రమాదం
  • సైడ్ ఎఫెక్ట్స్: వికారం, తలనొప్పి, రక్తం గడ్డకట్టడం
  • సహజంగానే పీరియడ్స్ రానివ్వడమే ఉత్తమం

Serious Health Risks of Period Delay Medicines : పెళ్లిళ్లు, ట్రిప్స్, పరీక్షలు ఇలా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలు, మహిళలు పీరియడ్స్‌ను ముందుకు లేదా వెనక్కి మార్చుకునేందుకు మెడిసిన్స్ వాడుతారు. సాధారణంగా ఇందుకోసం ప్రొజెస్టెరోన్ టాబ్లెట్లు ఉపయోగిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా లేకుండా వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 

రీసెంట్​గా ఓ అమ్మాయి పీరియడ్స్ ఆలస్యం చేసుకునేందుకు ట్యాబ్లెట్స్ వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో పీరియడ్స్ డిలే అయ్యేందుకు వేసుకునే ట్యాబ్లెట్స్​పై మరోసారి చర్చ మొదలైంది. దీనిపై క్లారిటి ఇస్తూ ఈ మాత్రలు వేసుకోవడం పలు సూచనలు చేశారు డాక్టర్ శిరీష. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్​లో ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజి కన్సల్టెంట్​గా చేస్తోన్న శిరీష పీరియడ్స్ రాకుండా చేసే మాత్రలు సేఫేనా? ఎప్పుడు ప్రమాదకరం? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలిపారు. అవేంటంటే.. 

పీరియడ్స్ మార్చే మాత్రలు ఎప్పుడు సేఫ్?

డాక్టర్ శిరీష ప్రకారం పీరియడ్స్ మార్చే మాత్రలు కేవలం గైనకాలజిస్ట్ సూచించినప్పుడు మాత్రమే వాడాలి.  అలాగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా 3 నుంచి 5 రోజుల వరకు మాత్రమే వీటిని వాడటం సురక్షితం. అలాగే మందులు ఆపిన తర్వాత వారం రోజుల్లో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.


Period Delay Pills : పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే

ఎవరికి ప్రమాదమో తెలుసా?

ఈ మెడిసన్స్ నేరుగా మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసి వాడటం మంచిది కాదు. కానీ వీటిని వారం రోజుల కంటే ఎక్కువగా వాడితే ప్రమాదం. అలాగే రెగ్యులర్‌గా వాడటం.. డాక్టర్ సలహా లేకుండా డోస్ మార్చడం మంచిది కాదు. 

సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..

పీరియడ్ డేట్స్ మార్చే మాత్రలు వాడితే కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాటిలో వికారం, తలనొప్పి, రొమ్ముల్లో నొప్పి లేదా మరింత స్మూత్​గా మారడం, పొట్ట ఉబ్బరం, పీరియడ్స్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వంటివి జరుగుతాయి. అలాగే మూడ్ స్వింగ్స్, ఒక్కసారిగా బ్లీడింగ్ ఎక్కువ అవడం, నిద్ర సమస్యలు వస్తాయి. 

అలాగే కాళ్లలో నొప్పి లేదా వాపు, ఛాతిలో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, శరీరం మొద్దుబారడం, చూపు మసకబారడం లేదా డబుల్ విజన్, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలని, వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు శిరీష. అలాగే ఈ మాత్రలను తప్పుగా, ఎక్కువగా వాడితే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్, ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కాబట్టి వీటిని లైట్ తీసుకోవద్దని చెప్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వీలైతే పీరియడ్స్‌ను సహజంగానే రావనివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడే డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. అలాగే శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు. 

సమ్మర్ స్పెషల్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget