అన్వేషించండి

Heat Stroke Symptoms : మీ శరీరం(Body) ఓవర్ హీట్ అవుతోందని చెప్పే సంకేతాలు ఇవే.. హీట్ స్ట్రోక్ విస్మరిస్తే ప్రాణాంతకమే

Excess Heat Deadly Symptoms : మీ శరీరం ఓవర్ హీట్ అవుతోందని చెప్పే సంకేతాలు చాలానే ఉన్నాయి. ఈ హీట్ స్ట్రోక్‌ లక్షణాలు విస్మరించొద్దని చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రమాద హెచ్చరికలు ఏవంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శరీరం వేడెక్కడం వల్ల అధిక చెమట, తల తిరగడం సంభవిస్తుంది.
  • తీవ్రమైన దాహం, చర్మం వేడెక్కడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది.
  • తలనొప్పి, కండరాల పట్టేయడం, వాంతులు, మత్తుగా అనిపించవచ్చు.
  • చెమట ఆగిపోతే హీట్ స్ట్రోక్ హెచ్చరిక, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

Dangerous Heat Stroke Symptoms : వేడి, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎక్కువసేపు ఎండలో తిరగడం, తక్కువ నీళ్లు తాగడం, అధిక వేడి ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం వల్ల శరీరం ఓవర్ హీట్ కావచ్చు. దీన్ని చాలామంది సాధారణ అలసటగా తీసుకుంటారు. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే అది హీట్ ఎగ్జాస్షన్ (Heat Exhaustion) లేదా హీట్ స్ట్రోక్‌కు సంకేతం కావొచ్చు. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చని అంటున్నారు నిపుణులు. మరి శరీరం ఓవర్ హీట్ అయ్యిందని చెప్పే సంకేతాలు ఏంటో.. వాటిని ఎందుకు విస్మరించకూడదో చూసేద్దాం.

అధిక చెమటలు 

బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు శరీరం వేడిని తగ్గించేందుకు ఎక్కువగా చెమటలు పడేలా చేస్తుంది. కానీ చెమటలు ఆగకుండా పడటం కూడా శరీరం ఒత్తిడిలో ఉందని సూచించే లక్షణమే. 

తల తిరగడం

ఎండలో ఎక్కువసేపు ఉంటే బీపీ లెవెల్స్ పడిపోతాయి. అలాగే డీహైడ్రేషన్ వల్ల తల తిరగడం లేదా సరిగ్గా నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

తీవ్రమైన దాహం

ఎంత నీళ్లు తాగినా దాహం తగ్గకపోతే శరీరంలో నీటి లోపం పెరిగిందని అర్థం. ఇది కూడా బాడీ ఓవర్ హీట్ అయిందని చూపించే లక్షణమే. 

చర్మం వేడిగా మారడం

శరీరం సాధారణం కంటే చాలా వేడిగా అనిపించడం, చర్మం ఎర్రబడటం కూడా సంకేతం కావచ్చు.

గుండె వేగంగా కొట్టుకోవడం

శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇది గుండెపోటుకు కారణం కావచ్చు.

తలనొప్పి

హీట్ కారణంగా వచ్చే తలనొప్పి.. అలసట, బలహీనత, కళ్ల ముందు చీకట్లు కనిపించడం వంటి లక్షణాలతో కలిసి వస్తుంది. 

కండరాలు పట్టేయడం

శరీరం ఎక్కువ చెమట విడుదల చేయడం వల్ల శరీరంలో ఉప్పులు, మినరల్స్ తగ్గిపోతాయి. దీంతో కాళ్లు, చేతుల్లో కండరాలు పట్టేయొచ్చు.

వాంతులు, వికారం

వేడిని శరీరం తట్టుకోలేకపోతే వికారం, వాంతులు రావచ్చు. ఇది హీట్ ఎగ్జాస్షన్ సంకేతం కావచ్చు.

మత్తుగా అనిపించడం

హీట్ స్ట్రోక్ తీవ్రంగా మారితే కన్ఫ్యూజన్, మాట తడబడటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపించొచ్చు.

తీవ్రమైన ప్రమాద హెచ్చరిక..

శరీరం చాలా వేడిగా ఉన్నా చెమటలు రావడం ఆగిపోతే అది హీట్ స్ట్రోక్‌కు కీలక హెచ్చరిక కావచ్చు. ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లాలి. నీళ్లు, కొబ్బరి నీళ్లు, ORS వంటివి తాగాలి.  

హీట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని గుర్తిస్తే వెంటనే వాళ్లని నీడలోకి తీసుకెళ్లాలి. అలాగే బిగుతుగా ఉన్న దుస్తులను తొలగించాలి. నీటిని తాగించాలి. ముఖం, మెడపై చల్లని నీరు చల్లాలి. పరిస్థితి తీవ్రమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే హీట్ స్ట్రోక్ వల్ల వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో శరీరం ఇచ్చే ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Advertisement

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget