అన్వేషించండి

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్

Detox Drinks : కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి.. వాటిని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేసే డ్రింక్స్ ఏంటో.. వాటితో ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిడ్నీ డిటాక్స్ డ్రింక్స్ లేవు, తగినంత నీరు ముఖ్యం.
  • నిమ్మ, క్రాన్ బెర్రీ, బార్లీ నీళ్లు కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • చక్కెర, ఉప్పు పానీయాలు, ఆల్కహాల్ కిడ్నీలకు హానికరం.
  • ఉప్పు తగ్గించి, బీపీ నియంత్రించి, కిడ్నీ పరీక్షలు చేయాలి.

Best Drinks for Kidney Health : శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, శరీరంలో ద్రవాలు, ఖనిజాల సమతుల్యాన్ని కాపాడటం వంటి కీలక పనులు చేస్తాయి. అందుకే కిడ్నీలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనిలో భాగంగా కిడ్నీలను డిటాక్స్ చేసేందుకు కొన్ని డ్రింక్స్ ఉపయోగపడతాయని సోషల్ మీడియాలో పోస్ట్​లు, వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిలో ఎంత నిజం ఉంది? ఏ డ్రింక్స్ తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చూద్దాం. 

కిడ్నీలను నేరుగా డీటాక్స్ చేసే మ్యాజిక్ డ్రింక్ ఏవి లేవని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యవంతమైన కిడ్నీలు సహజంగానే డీటాక్స్.. తమ పనిని చేస్తాయని అంటున్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తగినంతగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గి.. వాటి పనితీరు మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. అవేంటంటే.. 

మంచి నీరు

కిడ్నీల ఆరోగ్యానికి మంచి నీటికి మించిన పానీయం మరేది లేదని చెప్తారు. రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. అలాగే డీహైడ్రేషన్, కొన్ని రకాల కిడ్నీ రాళ్ల ప్రమాదం కూడా తగ్గవచ్చు. అయితే ఎంత నీరు తాగాలనేది వాతావరణం, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.

నిమ్మరసం కలిపిన నీరు

గోరువెచ్చని లేదా సాధారణ నీటిలో కొద్దిగా తాజా నిమ్మరసం కలిపి తాగవచ్చు. నిమ్మలో ఉండే సిట్రేట్ కొన్ని రకాల కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఇందులో చక్కెర కలపకుండా తాగితే మంచిది.

క్రాన్‌బెర్రీ జ్యూస్

క్రాన్‌బెర్రీలో ఉండే పాలీఫెనాల్స్ మూత్రనాళాల్లో బ్యాక్టీరియా అంటిపెట్టుకునే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. దీనివల్ల కొందరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-UTI ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. అయితే చక్కెర కలిపిన జ్యూస్‌కు బదులుగా చక్కెర లేని జ్యూస్‌ను ఎంచుకోవాలి.

బార్లీ నీళ్లు

బార్లీ నీరు శరీరానికి తేమను అందించే మంచి పానీయాల్లో ఒకటి. చక్కెర, ఉప్పు కలపకుండా తీసుకుంటే శరీరంలో ద్రవాల సమతుల్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కిడ్నీల పనితీరుకు తగినంత హైడ్రేషన్ చాలా ముఖ్యం.

మందార టీ

మందార పూలతో తయారుచేసే హెర్బల్ టీ యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు ఇది రక్తపోటు నియంత్రణకు కొంతమేర సహాయపడవచ్చని సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు కిడ్నీ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి.

ఇన్ఫ్యూజ్డ్ వాటర్

నీటిలో దోసకాయ ముక్కలు, నిమ్మ ముక్కలు లేదా పుదీనా ఆకులు వేసి తాగడం వల్ల నీరు ఎక్కువగా తాగే అలవాటు పెరుగుతుంది. షుగర్స్ ఉండే కూల్‌డ్రింక్స్‌కు బదులుగా వీటిని తీసుకోవచ్చు. 

కొబ్బరి నీరు, మజ్జిగ కూడీ డీహైడ్రేషన్ తగ్గించి.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.

తాగకూడనివి.. 

కిడ్నీల ఆరోగ్యానికి హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని డ్రింక్స్​కి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. చక్కెర ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర కలిగిన ప్యాక్డ్ జ్యూస్, అధిక ఉప్పు ఉన్న ఇన్‌స్టంట్ డ్రింక్స్, ఆల్కహాల్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెప్తారు. ఎందుకంటే ఇవి ఇవి కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లు 

కిడ్నీల ఆరోగ్యానికి రోజూవారి అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్తున్నారు నిపుణులు. రోజూ తగినంత నీరు తాగాలి. అలాగే ఉప్పు వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. రక్తపోటు, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకుంటూ.. ధూమపానానికి దూరంగా ఉండాలని అంటున్నారు. అవసరం లేని నొప్పి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. అలాగే సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget