విటమిన్ బి12(Vitamin B12) టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటే మంచిది? సరైన సమయం

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ B12 శక్తిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిది.

రోజూ ఒకే సమయానికి సప్లిమెంట్ తీసుకుంటే మంచిది. దీన్ని భోజనంతో లేదా భోజనం లేకుండా కూడా తీసుకోవచ్చు.

B12 లోపం తీవ్రతను బట్టి టాబ్లెట్, క్యాప్సూల్ లేదా ఇంజెక్షన్ అవసరం కావచ్చు. కాబట్టి వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోండి.

యాంటాసిడ్లు లేదా మెట్‌ఫార్మిన్ వంటి మందులు వాడుతున్నట్లయితే కచ్చితంగా విటమిన్ బి12 తీసుకునే ముందు వైద్యుడి సూచనలు తీసుకోవాలి.

ఈ సప్లిమెంట్‌ను టీ లేదా కాఫీతో వేసుకోకూడదు. నీటితో వేసుకుంటే మంచిది.

B12 లోపం ఉంటే అలసట, బలహీనత, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేందుకు సప్లిమెంట్ ఉపయోగపడుతుంది.

B12 లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. పరీక్ష లేకుండా దీర్ఘకాలం సప్లిమెంట్లు వాడకండి.

విటమిన్ B12 ప్రధానంగా జంతు ఆహారాల్లో లభిస్తుంది. శాకాహారం తీసుకునేవారు లేదా వెగన్ డైట్ పాటించేవారు సప్లిమెంట్ తీసుకోవాల్సి రావచ్చు.

గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చికెన్, మాంసం వంటి B12 అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. శాకాహారులు B12 ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు.