అన్వేషించండి

Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే

Best Foods For Joint Stiffness : కీళ్ల సమస్యలు చాలామందికి ఉంటాయి. సడెన్గా కాళ్లు పట్టేయడం, కీళ్లు బిగుతుగా మారడం జరుగుతుంది. అలాంటి వారు కొన్ని ఆహారాలు రోజూ తింటే మంచిదని చెప్తున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కీళ్ల బిగుతు, నొప్పుల నివారణకు సరైన ఆహారం ముఖ్యం.
  • చేపలు, పసుపు, ఆకుకూరలు, బెర్రీలు వాపు తగ్గిస్తాయి.
  • అదనంగా నట్స్, అల్లం, పెరుగు, వ్యాయామం, బరువు నియంత్రణ ముఖ్యం.
  • తీవ్రమైన నొప్పులుంటే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

Joint Stiffness Reducing Foods : ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్న తర్వాత కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపించడం చాలా మందికి జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ.. ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి కారణాలతో కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ డైట్​లో కొన్ని మార్పులు చేయాలి అంటున్నారు నిపుణులు.

కీళ్ల సమస్యలను ఆహారంతో పూర్తిగా నయం చేయలేకపోయినా.. వాటి ప్రమాదాన్ని, ఇబ్బందులను తగ్గించవచ్చని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే కొన్ని పోషకాలు శరీరానికి అందించడం వల్ల వాపు తగ్గి.. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల బిగుతు, నొప్పులు అదుపులోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?

ఫ్యాటీ ఫిష్

సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చు. దీంతో కీళ్ల బిగుతు, నొప్పి కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వంటల్లో పసుపును క్రమం తప్పకుండా ఉపయోగించడం లేదా వైద్యుల సలహాతో తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. 

Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే

ఆకుకూరలు

పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కె, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి.

బెర్రీలు

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి.. కీళ్ల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. 

వాల్‌నట్స్, బాదం

వాల్‌నట్స్, బాదం వంటి నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం కీళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తారు.

Also Read : వంకాయ, పెరుగుతో టేస్టీ రెసిపీ.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే టేస్టీ, ఈజీ కూడా

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో ఉండే హెల్తీ ఫ్యాట్స్(ఆరోగ్యకరమైన కొవ్వులు), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని పరిశోధనలు తెలిపాయి.

Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే

అల్లం

అల్లంలోని సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వంటల్లో లేదా అల్లం టీ రూపంలో తీసుకోవడం వల్ల కొందరిలో కీళ్ల అసౌకర్యాన్ని తగ్గుతుంది.

సిట్రస్ పండ్లు

నారింజ, బత్తాయి, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. కొల్లాజెన్ కీళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

బీన్స్, పప్పుధాన్యాలు

శనగలు, రాజ్మా, మినుములు, పెసర్లు వంటి పప్పుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

పెరుగు

పెరుగులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

Also Read : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

కీళ్ల ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కూడా ఫాలో అవ్వాలి..

కీళ్ల బిగుతూ దూరమై.. కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పూర్తిగా ఆహారంపై ఆధారపడకూడదని రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దానిలో భాగంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. తగినంత నీరు తాగాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి. విటమిన్ డి, కాల్షియం లోపం ఉంటే వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకుని.. దానికి తగ్గట్లు మెడిసన్ తీసుకోవాలి.

Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కీళ్ల బిగుతు తరచూ వస్తుంటే, నొప్పి ఎక్కువగా ఉంటే, వాపు లేదా ఎర్రబడటం కనిపిస్తే కేవలం ఆహారంపై ఆధారపడకుండా ఆర్థోపెడిక్ లేదా రుమటాలజీ నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది ఆర్థరైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, అవసరమైతే వైద్య చికిత్స కలిపి తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు అందుతాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget