తరచూ కాళ్లు పట్టేస్తున్నాయా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

డీహైడ్రేషన్ వల్ల కండరాలు పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు మంచిగా తీసుకోండి.

పొటాషియం లోపం కూడా కారణం కావచ్చు. అరటిపండ్లు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవచ్చు.

మెగ్నీషియ ఖనిజం తక్కువగా ఉంటే కండరాల పనితీరు దెబ్బతింటుంది.

కాల్షియం కొరత కూడా కండరాలు పట్టేయడానికి కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు.

గంటల తరబడి నిలబడటం వల్ల కాళ్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

అతిగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు అలసిపోయి క్రాంప్స్ రావచ్చు.

కాళ్లకు తగినంత రక్తప్రసరణ జరగకపోతే తిమ్మిర్లు, క్రాంప్స్ వస్తాయి.

గర్భిణుల్లో హార్మోన్ల మార్పులు, ఖనిజాల లోపం వల్ల ఈ సమస్య కనిపించవచ్చు.

డయూరెటిక్స్ వంటి కొన్ని మందులు కాళ్ల క్రాంప్స్‌కు కారణం కావచ్చు.

డయాబెటిస్, నరాల దెబ్బతినడం వంటి సమస్యల్లో కూడా తరచూ కాళ్లు పట్టేయవచ్చు.

తరచూ కాళ్లు పట్టేయడం, తీవ్రమైన నొప్పి లేదా వాపుతో కలిసి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.