అన్వేషించండి

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

Hair Growth Secrets : జుట్టుకు నూనెకు రాయడంపై చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ చెప్తారు కాబట్టి. మరి జుట్టు పెరగాలంటే స్కాల్ప్​కి నూనె పెట్టాలా? లేదా జుట్టుకి పెట్టాలా ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్కాల్ప్ ఆయిలింగ్ కుదుళ్లను పోషిస్తుంది, రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
  • హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ పొడి జుట్టుకు తేమ అందించి, మెరుపునిస్తుంది.
  • స్కాల్ప్, జుట్టు అవసరాలకు తగిన పద్ధతిని ఎంచుకోవాలి.

Hair Oiling Tips : జుట్టుకు నూనె రాయడం అనేది తరతరాలుగా వస్తున్న అలవాటు. అయితే చాలామందికి తెలిసినది ఏంటంటే.. జుట్టుకు నూనె రాయడం అంటే కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు ఫుల్​గా రాయడమే. కానీ కొందరు జుట్టుకు కాదు.. స్కాల్ప్‌కి నూనె రాయాలి అంటారు. మరికొందరు స్కాల్ప్​కి కాదు.. జుట్టు పొడవునకే రాయాలి అంటారు. ఈ రెండింటిలో ఏది నిజం? జుట్టు సమస్యను బట్టి నూనె రాయాలా? ఎలా అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో చూసేద్దాం. 

స్కాల్ప్ ఆయిలింగ్ బెనిఫిట్స్

స్కాల్ప్ ఆయిలింగ్ అంటే తల చర్మానికి నేరుగా నూనె అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయడం. ఇది జుట్టు కుదుళ్లను పోషించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల పొడిగా ఉండే స్కాల్ప్, దురద వంటి సమస్యలు తగ్గి స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. సున్నితంగా మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్‌కు రక్తప్రసరణ మెరుగై జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.

Also Read : అవిసె గింజలు జెల్ తలకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే.. ఇలా తయారు చేసి, అలా అప్లై చేసేయండి

మాడుకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రిలాక్స్‌గా అనిపించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొబ్బరి నూనె, బాదం నూనె, భృంగరాజ్ ఆయిల్ వంటి నూనెల్లో ఉండే పోషకాలు కుదుళ్లకు మేలు చేస్తాయి. తల చర్మం బాగా పొడిగా ఉండే వారు స్కాల్ప్​కి నూనె పెట్టడం మంచిది.  ఆయిలీ స్కాల్ప్, చుండ్రు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఎక్కువసేపు నూనె ఉంచకుండా వైద్యుల సూచన మేరకు మాత్రమే ఉపయోగించాలి.

హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ 

హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ అంటే స్కాల్ప్​కి అప్లై చేయకుండా కేవలం జుట్టుకు పొడవునకు మాత్రమే నూనె రాయడం. ఇలా జుట్టు చివర్ల వరకు ఆయిల్ అప్లై చేస్తే.. పొడిబారిన జుట్టుకు తేమ అందుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం తగ్గే అవకాశం ఉంటుంది. జుట్టు చిట్లిపోవడం, ఎగిరిపోవడం తగ్గి సాఫ్ట్‌గా కనిపిస్తుంది. నూనె వల్ల జుట్టు క్యూటికల్ స్మూత్‌గా మారి సహజమైన మెరుపు వస్తుంది. స్టైలింగ్ టూల్స్, సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

మీ జుట్టుకు ఏది అవసరం?

మీకు పొడి స్కాల్ప్, దురద ఉంటే.. నూనెను మాడునకు అప్లై చేయడం మంచిది. మీ జుట్టు పొడిబారిపోయి, ఫ్రిజ్జీగా, స్ప్లిట్ ఎండ్స్ ఉంటే.. హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. స్కాల్ప్ ఆయిలీగా ఉండి జుట్టు మాత్రం డ్రైగా ఉంటే.. తల చర్మానికి నూనె రాయకుండా జుట్టు చివర్లకు మాత్రమే నూనె అప్లై చేయడం మంచిది. కర్లీ హెయిర్ ఉన్నవారు.. స్ట్రాండ్ ఆయిలింగ్ ద్వారా జుట్టు తేమను ఎక్కువసేపు నిలుపుకోవచ్చు.

Also Read  : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

నూనె రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నూనెను జుట్టుకు వారానికి 1 లేదా 2 సార్లు నూనె రాస్తే చాలామందికి సరిపోతుంది. గోరువెచ్చని నూనెతో 5 నుంచి 10 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. రాత్రంతా నూనె ఉంచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు అలా చేయకూడదు. ఎక్కువ మొత్తంలో నూనె రాయడం కూడా మంచిది కాదు. 

జుట్టు పెరుగుదల కోసం కావాల్సిన మరిన్ని చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget