అన్వేషించండి

Banana Hair Mask : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

DIY Hair Mask : జుట్టు పొడిబారిపోయి బాగా రాలిపోతుందా? అయితే మీరు అరటిపండుతో హెయిర్ మాస్క్ ట్రై చేయండి. ఇది జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? దీనివల్ల ఇబ్బందులు ఉంటాయా? చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అరటి మాస్క్ జుట్టుకు తేమ, మృదుత్వాన్ని అందిస్తుంది.
  • అరటి, తేనె, పెరుగుతో మాస్క్ సులభంగా తయారుచేయవచ్చు.
  • సమగ్రంగా రుబ్బి, ప్యాచ్ టెస్ట్ చేసి వాడాలి.
  • జుట్టు పెరుగుదలకు దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.

Banana Hair Mask Benefits : జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా లభించే అరటిపండుతో కూడా చాలామంది హెయిర్ మాస్క్ చేసుకుంటారు. దీనిని ఎలా చేసుకోవాలి? అరటిపండు తలకు అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇబ్బందులు ఉంటాయా? 

అరటిపండులో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, సహజ నూనెలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో జుట్టుకు కొన్ని ప్రయోజనాలు ఇస్తాయి. అందుకే దీనిని ఆరోగ్యంతో పాటు జుట్టుకోసం ఉపయోగిస్తున్నారు. అయితే దీనిని తలకు అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. అరటిపండుతో హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి? జుట్టుకు కలిగే లాభాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

అరటిపండు - 1 పండినది

తేనె - 1 టేబుల్ స్పూన్ 

పెరుగు - 1 టేబుల్ స్పూన్ లేదా కొబ్బరి నూనె

తయారీ విధానం

అరటిపండును చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్‌లో మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో తేనె, పెరుగు లేదా కొబ్బరి నూనె కలపాలి. అన్నీ బాగా బ్లెండ్ అయ్యేలా చూసుకోవాలి. మాస్క్ రెడీ. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమానంగా అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

అరటిపండు హెయిర్ మాస్క్​తో కలిగే లాభాలు

అరటిపండులోని సహజ తేమ జుట్టు పొడిబారకుండా సహాయపడుతుంది. దీంతో జుట్టు సాఫ్ట్‌గా అనిపించవచ్చు. పొడిబారిన, చిట్లిన జుట్టులో తేమను నిలుపుకోవడం ద్వారా ఫ్రిజ్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. హెయిర్ మాస్క్ వాడిన తర్వాత జుట్టు కొంత మెత్తగా, మెరిసేలా కనిపిస్తుంది. పొడిబారిన స్కాల్ప్ తగ్గి తేమ అందుతుంది. తేమ, పోషకాలు అందడం వల్ల జుట్టు డ్రైగా మారకుండా ఉండి చిట్లిపోవడం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే జుట్టు చిక్కులు తగ్గి దువ్వుకోవడం సులభంగా మారవచ్చు.

అరటిపండు హెయిర్ మాస్క్​తో కలిగే ఇబ్బందులు

అరటిపండును సరిగ్గా గ్రైండ్ చేయకపోతే చిన్న ముక్కలు జుట్టులో ఇరుక్కుపోయి తొలగించడం కష్టమవుతుంది. అలాగే మాస్క్ అప్లై చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో జుట్టు నుంచి పూర్తిగా తొలగించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కొంతమందికి తేనె లేదా ఇతర పదార్థాల వల్ల అలెర్జీ రావచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. 

ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు ఎక్కువగా నూనె కలిపి వాడితే జుట్టు మరింత జిడ్డుగా మారవచ్చు. అలాగే అందరికీ ఒకే విధమైన ఫలితాలు రావు. జుట్టు స్వభావం, స్కాల్ప్ పరిస్థితిని బట్టి ఫలితాలు మారతాయి. 

అరటిపండుతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టుకు తేమను అందించి మృదువుగా ఉంచడంలో సహాయపడవచ్చు. అయితే ఇది జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపేస్తుంది లేదా కొత్త జుట్టు పెంచుతుంది అనే శాస్త్రీయ ఆధారాలు పెద్దగా లేవు. కాబట్టి దీనిని ఒక సహజ హెయిర్ కేర్ పద్ధతిగా మాత్రమే ఉపయోగించాలి. జుట్టు రాలడం లేదా స్కాల్ప్ సమస్యలు ఎక్కువగా ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

జుట్టుకు సంబంధించిన మరిన్ని చిట్కాలు, DIYల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget