Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Uppal Balu Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు బిగ్ బాస్ మేకర్స్‌కు రిక్వెస్ట్ చేశాడు. తనను హౌస్‌లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Uppal Balu Request For Bigg Boss 10 Chance : తెలుగు ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరింత హైప్ క్రియేట్ చేస్తుండగా... అగ్నిపరీక్ష సీజన్ 2 దానికి పదింతలు హైప్ ఇచ్చేలా సాగుతోంది. అయితే, ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు... అగ్నిపరీక్ష జడ్జెస్‌పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తనకు ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా ఎలిమినేట్ విమర్శించాడు. ముఖ్యంగా నవదీప్, బిందు మాధవిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరే తనకు అవకాశం రాకుండా చేశారంటూ మండిపడ్డాడు. తాజాగా, మరో వీడియో రిలీజ్ చేశాడు. అయితే, అది విమర్శిస్తూ కాదు. బిగ్ బాస్ నిర్వాహకులకు రిక్వెస్ట్ చేశాడు.
'ప్లీజ్... నన్ను తీసుకోండి'
ఇది తన లాస్ట్ వీడియో అని... బిగ్ బాస్‌కు తనను తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు ఉప్పల్ బాలు. 'బిగ్ బాస్ యాజమాన్యం ప్లీజ్ నన్ను తీసుకోండి. మా టీవీ, నాగార్జున సార్‌కు రిక్వెస్ట్ చేస్తున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా నన్ను తీసుకోండి. మీకు రేటింగ్ వస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. కామెడీ చేస్తా, టాస్కులు ఆడతా. అన్నీ వస్తాయి. ప్రతీ ఒక్క సీజన్ నేను తప్పకుండా చూస్తా.
బిగ్ బాస్‌కు వెళ్లాలని నాకు కోరిక ఉంది. నన్ను హౌస్‌లోకి పంపించాలని నా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. నన్ను ఇప్పటివరకూ సపోర్ట్ చేసిన నా ఫ్యాన్స్‌కు పేరు పేరునా ధన్యవాదాలు. వారు చూపించిన ప్రేమ నా లైఫ్‌లో మర్చిపోలేను. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేశాడు.
View this post on Instagram
ఇటీవల అగ్నిపరీక్షలో పాల్గొన్న ఉప్పల్ బాలు తనను తీవ్రంగా అవమానించారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశాడు. అందుకు తగ్గట్లుగానే అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ వైరల్ అయ్యింది. 'మిమ్మల్ని పంపించి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి', 'మీకు ఫ్యాన్స్ ఉన్నారని నమ్ముతున్నారా? అవి వెకిలి వీడియోస్ కదా?' అంటూ జడ్జ్ నవదీప్ ప్రశ్నించాడు. 'బాలు నువ్వు ట్రాన్స్ కదా' అంటూ క్వశ్చన్ చేయడం విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో ఉప్పల్ బాలుకు చాలామంది సపోర్ట్‌గా నిలిచారు. జడ్జెస్ అలా అడగడం కరెక్ట్ కాదంటూ పోస్టులు పెట్టారు.
ఈ వివాదంపై ఇండైరెక్ట్‌గా హీరో నవదీప్ రియాక్ట్ అయ్యారు. 'బిగ్ బాస్ సమాజాన్ని రిఫ్లెక్స్ చేసే స్మాల్ స్కేల్ మోడల్. హౌస్‌లో రకరకాల మనుషులతో ఉన్నప్పుడు ఎవడెవడు ఏదేదో అంటాడు. ఆ మాటల్ని ఎలా తీసుకుంటాం. ఎలా రియాక్ట్ అవుతాం. మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం అనేదే పాయింట్. దాని టెస్టే అగ్నిపరీక్ష' అంటూ క్లారిటీ ఇచ్చారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















