అన్వేషించండి

Gas and Bloating : గ్యాస్, బ్లోటింగ్‌ను తగ్గించే సహజమైన ఫుడ్స్ ఇవే.. జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఇవి తినేయండి

Foods to Ease Bloating : గ్యాస్, కడుప ఉబ్బరం సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను దూరం చేసే ఫుడ్స్ లిస్ట్ ఇక్కడుంది. చూసి లాగించేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కడుపులో గ్యాస్, ఉబ్బరం ఆహారపు అలవాట్ల వల్ల తరచుగా వస్తాయి.
  • అల్లం, పెరుగు, సోంపు వంటివి జీర్ణక్రియను మెరుగుపరచి ఉపశమనం ఇస్తాయి.
  • అరటి, పుదీనా, కీరదోస కూడా గ్యాస్ తగ్గించి, శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
  • తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

Natural Foods That Help Reduce Gas and Bloating : కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలు చాలా మందిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎక్కువగా తినడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఒక్కసారిగా తీసుకోవడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. బ్లోటింగ్ కారణంగా కడుపు బరువుగా అనిపించడం, అసౌకర్యం, నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని ఫుడ్స్ డైట్‌లో చేర్చుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

గ్యాస్, బ్లోటింగ్ వల్ల కలిగే ఇబ్బందులు

గ్యాస్ ఎక్కువగా పేరుకుపోతే కడుపు బిగుసుకుపోయినట్లు, ఉబ్బినట్లు అనిపిస్తుంది. పేగుల్లో గ్యాస్ చిక్కుకుపోవడం వల్ల తిమ్మిరి, మెలికలు తిరిగినట్లు నొప్పి రావచ్చు. కడుపు నిండిన భావన వల్ల తినాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. ఎప్పుడూ కడుపు బరువుగా ఉండటం వల్ల రోజువారీ పనులపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు గ్యాస్ వల్ల ఛాతీలో బరువుగా అనిపించి గుండె సమస్యలా భావించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సహజమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్, బ్లోటింగ్ తగ్గే అవకాశం ఉంది. అవేంటంటే..

అల్లం

అల్లంలో ఉండే జింజరాల్ అనే సమ్మేళనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గించి కడుపునకు ఉపశమనం ఇస్తుంది. ఉబ్బరం, గ్యాస్ ఫీలింగ్ ఉన్నప్పుడు అల్లాన్ని దంచి నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు. లేదా ఇతర వంటల్లో కలిపి తీసుకోవచ్చు.

పెరుగు

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గవచ్చు. కాబట్టి పెరుగును నేరుగా లేదా అన్నంతో కలిపి తీసుకోండి.

సోంపు, జీలకర్ర

సోంపు గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. కాబట్టి భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే జీలకర్ర కూడా జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడి బ్లోటింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు ఒకటి తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

పుదీనా

పుదీనా ఆకులు పేగుల కండరాలను సడలించి గ్యాస్, అజీర్ణం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. తాగే నీటిలో వీటిని వేసుకుని రోజంతా తాగితే మంచిది.

కీరదోస

కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత లేదా స్నాక్స్ రూపంలో దీనిని తీసుకోవచ్చు.

మరిన్ని ఫుడ్స్

బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది. స్నాక్ టైమ్లో, లంచ్ తర్వాత తీసుకునేందుకు అనువైనది. ఓట్స్‌లో ఉండే కరిగే ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మితంగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. బ్లోటింగ్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

గ్యాస్, బ్లోటింగ్ సాధారణ సమస్యలే అయినప్పటికీ.. తరచూ వస్తుంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అల్లం, పెరుగు, సోంపు, బొప్పాయి వంటి సహజ ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచి ఉపశమనం ఇవ్వగలవు. అయితే గ్యాస్, బ్లోటింగ్‌తో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం లేదా ఇతర లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget