అన్వేషించండి

Fasting Benefits : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? జీర్ణ సమస్యలకు బెస్ట్ సొల్యూషన్ ఇదే

Benefits of Fasting : కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి ఎన్నో గట్ సమస్యలు వయసుతో తేడా లేకుండా పెరిగిపోతున్నాయి. వీటిని సహజంగా తగ్గించేందుకు ఫాస్టింగ్ బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. ఎందుకంటే..

Fasting Technique for Digestion Problems : పొట్ట శరీరంలో ముఖ్యమైన, అవసరమైన భాగం. కడుపు సరిగ్గా ఉంటే.. సగం కంటే ఎక్కువ రోగాలు వాటంతట అవే నయం అవుతాయని అంటారు. కానీ నేటి సౌకర్యవంతమైన జీవనశైలి కారణంగా.. పొట్ట సంబంధిత సమస్యలు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆకలి లేకపోవడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, పొట్టలో భారంగా అనిపించడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే వీటికి చెక్ పెట్టాలంటే ఓ టెక్నిక్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఈ  జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఏమి చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

ఫాస్టింగ్ చేస్తే కలిగే లాభాలు

అన్ని జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఫాస్టింగ్ బెస్ట్ ఆప్షన్​గా చెప్తున్నారు. ఈ ఉపవాసంలో మిమ్మల్ని మీరు ఆకలితో ఉంచుకోవలసి ఉంటుంది. కానీ ఇది ఏమాత్రం శిక్ష కాదు. ఇది ఒక ఔషధం. పొట్ట సంబంధిత వ్యాధులను కొంతవరకు మందులతో నయం చేయవచ్చు. కానీ కొంత సమయం తర్వాత మందుల ప్రభావం కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో ఫాస్టింగ్ చేయడం మంచిదని చెప్తున్నారు. దీనివల్ల శరీరం లోపలి నుంచి శుభ్రపడుతుంది. ఏ మందులు చేయనంత ఎఫెక్టివ్​గా పొట్టను లోతుగా శుభ్రపరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. శరీరాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.

ఫాస్టింగ్ ఎలా చేయాలి?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఉపవాసం ఎలా చేయాలి? మొదట మీరు 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం ప్రారంభించవచ్చు. దీని కోసం ఏకాదశి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. ఉపవాసం ప్రారంభంలో పండ్లను తీసుకోండి. శరీరానికి శక్తినిచ్చేంత మాత్రమే పండ్లను తినాలి. పొట్ట నింపుకోవడానికి పండ్లను ఫుల్​గా తీసుకోకండి. తేనె కలిపిన నీరు, కొబ్బరి నీరు, సాధారణ నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. నీరు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే ఉపవాసం వల్ల మీకు నీరసం వంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తుంది. క్రమంగా మీ స్టామినా బట్టి ఈ 15రోజులు కాస్త వారానికోసారి ఫాస్టింగ్ చేసుకోవచ్చు.

ఉపవాసం చేయడం వల్ల నీరసం వస్తుందా?

ఉపవాసం చేయడం వల్ల బలహీనంగా అనిపిస్తుందని కొందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఇది మన మనస్సు భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆహారం నుంచి శరీరానికి 30-40 శాతం మాత్రమే శక్తి లభిస్తుంది. మిగిలిన శక్తి నీరు, గాలి, విశ్రాంతి తీసుకోవడం ద్వారా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉపవాసం చేయడం వల్ల బలహీనత వస్తుందని అనుకోవడం తప్పు. జపాన్ శాస్త్రవేత్తలు ఉపవాసంపై పరిశోధన కూడా చేశారు. 2018 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని చెడు కణాలను తొలగించి కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియను ఆటోఫాగీ అంటారు. 

మధుమేహం, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఫాస్టింగ్ విషయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి. మేము తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు తీసుకునే మోతాదును తగ్గించి తీసుకోవాలి. ఈ ఫాస్టింగ్ వల్ల దాదాపు జీర్ణ సమస్యలు సహజంగా తగ్గడం ప్రారంభిస్తాయి. మీరు కూడా యాక్టివ్​గా మారుతారు. తేలికపాటి వ్యాయామం కూడా మీ రొటీన్​లో యాడ్ చేస్తే.. సూపర్ హెల్తీగా ఉంటారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget