Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Reasons Behind Infidelity and Affairs : వివేహతర సంబంధం, రిలేషన్లో ఉంటూ చీట్ చేయడం వంటి వాటికి కారణాలు ఏంటి.. మగవారు, ఆడవారికి మధ్య చీటింగ్ విషయంలో ఎలాంటి తేడాలు ఉంటాయి.. నిపణులు ఏమంటన్నారో చూసేద్దాం.

- మోసం శారీరకం కాదు, రహస్య భావోద్వేగ అనుబంధం.
- మోసం ఆకస్మిక పొరపాటు కాదు, కొన్ని పరిస్థితుల్లో నిర్ణయం.
- అసంతృప్తి లేకున్నా, అవకాశాలు, బలహీన క్షణాలు మోసానికి కారణం.
Common Reasons Behind Infidelity and Affairs : ఎలాంటి సంబంధానికైనా నమ్మకమే అత్యంత బలమైన పునాది. కానీ జంటలోని ఒక భాగస్వామి మరొక వ్యక్తికి భావోద్వేగపరంగా లేదా శారీరకంగా దగ్గరైనప్పుడు.. ఈ నమ్మకం బలహీనపడటం మొదలవుతుంది. వివాహేతర సంబంధం లేదా భాగస్వామిని మోసం చేసిన తర్వాత.. చాలామంది అదొక "పొరపాటు" అని చెబుతూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు దానిని క్షణికావేశంలో జరిగిందని.. మరికొందరు పరిస్థితులు అనుకూలించక అంతా హఠాత్తుగా జరిగిపోయిందని అంటారు.
రిలేషన్స్‌లో అవిశ్వాసం అనేది హఠాత్తుగా జరిగే పొరపాటా? లేక అది వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తన వల్ల జరుగుతుందా? ఈ ప్రశ్న చాలా కాలంగా చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఏ సంబంధంలో అయినా అసంతృప్తి మాత్రమే మోసానికి కారణం కాదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన రిలేషన్లో ఉన్నవారు కూడా తమ భాగస్వాములను మోసం చేయగలరట. దీనికి ఆవేశపూరిత ప్రవర్తన, భావోద్వేగ అవసరాలు వంటి అనేక అంశాలు కారణమవుతాయని చెప్తున్నారు.
Also Read : బెటర్ లైఫ్ కోసం 80/20 రూల్.. ఆరోగ్యం నుంచి రిలేషన్షిప్స్ వరకు ఇది బెస్ట్
రిలేషన్లో మోసం అంటే ఏమిటి?
అవిశ్వాసం లేదా మోసం అనేది కేవలం మరొక వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాదు. ఒక సంబంధంలో ఉన్నప్పుడు.. వారికి తెలియకుండా వేరొకరితో భావోద్వేగ, ప్రేమ, లేదా లైంగిక సంబంధం కలిగి ఉండడం కూడా దీనిలో భాగమే. దీనిని సాధారణంగా లైంగిక, భావోద్వేగ లేదా రెండింటి కలయిక అంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ వల్ల కూడా ఈ మోసం చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. దీనిలో ఒక వ్యక్తి తమ ప్రస్తుత సంబంధంలో నిర్దేశించుకున్న హద్దులను దాటుతూ.. ఆన్‌లైన్‌లో వేరొకరితో రహస్యంగా భావోద్వేగ లేదా ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు.
అకస్మాత్తుగా జరిగే పొరపాటు?
భాగస్వామిని మోసం చేసిన తర్వాత.. చాలామంది దానిని ఒప్పుకోవడానికి "అది అలా జరిగిపోయింది" లేదా "ఆ సమయంలో నాకు అర్థం కాలేదు" వంటి మాటలు చెప్తూ ఉంటారు. తొందరపాటు ప్రవర్తన అంటే పరిణామాల గురించి పెద్దగా ఆలోచించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది.. ఒక వ్యక్తి మోసం చేసే అవకాశాన్ని ప్రభావితం చేయగలదు. అయితే దీని అర్థం తొందరపాటు స్వభావం ఉన్న వ్యక్తి తన నిర్ణయాలకు బాధ్యత వహించడని కాదని కూడా చెప్తున్నారు.
2016లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. లైంగిక ఆవేశానికి, చీటింగ్, ప్రమాదకరమైన లైంగిక ప్రవర్తన వంటి అంశాలకు సంబంధం ఉందని తేల్చింది. అయితే ఒక వ్యక్తి ప్రవర్తనను నిర్ధారించే ఏకైక అంశం కేవలం ఆవేశం మాత్రమే కాదు. వారి వ్యక్తిత్వం, సెల్ఫ్ కంట్రోల్, వ్యక్తిగత విలువలు, సంబంధాల పట్ల వారికున్న అవగాహన కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేయగలవు.
మోసం చేసినందుకు పశ్చాత్తాప పడతారా?
కొందరు వివాహేతర సంబంధం తర్వాత వారు తీవ్రమైన పశ్చాత్తాపాన్ని పొందినట్లు బిహేవ్ చేస్తారు. కానీ పరిశోధనలు దానికి భిన్నమైన ఆన్సర్స్ ఇస్తున్నాయి. 'ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్'లో ప్రచురించిన 2023 నాటి ఒక అధ్యయనం.. వివాహేతర సంబంధాలలో పాల్గొన్న వివాహితుల అనుభవాలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలామంది తమ సంబంధాల ద్వారా లైంగిక, భావోద్వేగ సంతృప్తిని పొందినట్లు తెలిపారు. అలాగే వారిలో పశ్చాత్తాపం కూడా చాలా తక్కువగా ఉంది. కానీ ఈ సంబంధం తమ వివాహానికి హాని కలిగించిందని.. మరికొందరు నమ్మలేదని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
Also Read : మీకంటే వయసు చాలా ఎక్కువ ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే .. లాభాలేంటి? నష్టాలేంటి? రిలేషన్ సక్సెస్ అవుతుందా?
పార్టనర్‌ని ఎందుకు చీట్ చేస్తారు?
ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. మనస్తత్వవేత్తల ప్రకారం.. మోసం చేయడానికి వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే మోసం చేసే వ్యక్తి తన ప్రస్తుత సంబంధంతో పూర్తిగా అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మరొక వ్యక్తికి దగ్గరవ్వడానికి దొరికే అవకాశమే ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. 2023లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎవరు తమ భాగస్వామిని ముందుగా మోసం చేయడానికి ప్రణాళిక వేసుకోరు. కానీ అవకాశం వచ్చినప్పుడు, అలసటతో ఉన్నప్పుడు, మద్యం, పరధ్యానం లేదా వీక్ మూమెంట్ వంటి పరిస్థితుల కారణంగా చీట్ చేస్తారు.
చీటింగ్‌లో మగవారు, ఆడవారికి తేడాలు ఉంటాయా?
పురుషులు, మహిళల మధ్య లైంగికపరమైన చీటింగ్‌లలో కొన్ని తేడాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొంతమంది పురుషులు తీరని లైంగిక అవసరాలను కారణంగా పేర్కొనవచ్చు. కొంతమంది మహిళలు తీరని భావోద్వేగ అవసరాలను కారణంగా పేర్కొనవచ్చు. అయితే దీనిని ప్రతి వ్యక్తికీ వర్తింపజేయలేమని అంటున్నారు.
రిలేషన్స్ గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























