Modern Relationships : ఓపెన్ రిలేషన్షిప్ నుంచి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వరకు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఇవే
Gen Z Relationship Trends : రిలేషన్లో జెన్ జి కిడ్స్ పీహెచ్డీ చేస్తున్నారు. పరిస్థితులకు, వారికి అనుగుణంగా తెరపైకి కొన్ని రిలేషన్స్ తెస్తున్నారు. అవేంటో వాటి అర్థాలు ఏంటో చూసేద్దాం.

Romantic Relationship Trends : ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రొమాంటిక్ రిలేషన్షిప్స్ అందుబాటులో ఉంటున్నాయి. మార్కెట్లో ఉన్నాయంటే ఇవేమి కొనుక్కునేవి కాదు. కానీ మార్కెట్లో దొరికే వస్తువుల్లా మారిపోయాయి రిలేషన్షిప్స్. ముఖ్యంగా జెన్ జి కిడ్స్ ఈ రిలేషన్ షిప్స్ ట్రెండ్స్‌ని బాగా ఫాలో అవుతున్నారు. ప్రతి వ్యక్తితోనూ వారికున్న రిలేషన్‌కి విచిత్రమైన పేర్లు పెట్టేసి ట్రెండ్ చేస్తున్నారు. మరి అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రిలేషన్షిప్స్ ఏంటో చూసేద్దాం.
రిలేషన్షిప్(Relationship)
ఇది క్లాసిక్ రిలేషన్‌గా చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ లేదా డేటింగ్ చేస్తూ పెళ్లి చేసుకోవాలనుకుంటే దానిని రిలేషన్షిప్ అంటారు. దీనిలో కమిట్మెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఒకరికొకరు ఇచ్చుకున్న ప్రామిస్‌లను వర్క్ అవుట్ చేసేందుకు ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు.
సిచ్యూయేషన్షిప్ (Situationship)
ఈ రిలేషన్లో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ దానికంటూ ఏమి పేరు పెట్టరు. వీరు డేట్స్‌కి వెళ్తారు. రోజంతా చాటింగ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రొమాన్స్ కూడా చేసుకుంటారు. కానీ ఈ రిలేషన్‌ని సీరియస్‌గా తీసుకెళ్లరు. పరిస్థితులకు అనుగుణంగా తమ రిలేషన్ కొనసాగిస్తారు.
ఓపెన్ రిలేషన్షిప్ (Open Relationship)
ఈ రిలేషన్లో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అలాగే వీరిద్దరూ వేరే వాళ్లతో రిలేషన్‌ని పెట్టుకున్నా ఎలాంటి గొడవలు లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌ని కమ్యూనికేషన్‌తో, నమ్మకంతో ముందుకు తీసుకెళ్తారు. ఎలాంటి జెలసీ ఉండదు.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ (Long Distance Relationship)
ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు సిటీకి దూరంగా, విదేశాల్లో ఉంటూ తమ ప్రేమను కొనసాగిస్తే దానిని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటారు. తమ శారీరక, మానసిక రిలేషన్‌ని కాల్స్, మెసేజ్‌లు, వీడియో చాట్స్‌తో రిప్లేస్ చేస్తారు. వాళ్లు కలిసినప్పుడు ఆ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు.
లవ్-హేట్ రిలేషన్షిప్ (Love Hate Relationship)
ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోయేంత గొడవపడిన మళ్లీ కలిసి ఉండడాన్ని లవ్ హేట్ రిలేషన్షిప్ అంటున్నారు. వారిపై ప్రేమను, కోపాన్ని, ఫ్రస్టరేషన్ని కూడా ఒకేలా ఎదుటి వ్యక్తికి చూపిస్తారు. క్రిస్పీగా చెప్పాలంటే వారు ఒకరికొకరు అర్థంకారు. కానీ కలిసే ఉంటారు. విడిపోయి ఉండలేరు.
సోల్‌మేట్ కనెక్షన్ (Soulmate Connection)
ఓ వ్యక్తితో కలిసి ఉన్న లేకున్నా.. వారి మధ్య బంధం ఏమాత్రం తగ్గదు. ఇద్దరూ కలిసి లేకపోయినా వారి హార్ట్‌లో వారితో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటారు.
ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ (Friends with Benefits)
ఇద్దరూ ఫిజికల్‌గా రిలేషన్లో ఉంటారు. కానీ దానికంటూ రిలేషన్షిప్ అనే పేరు పెట్టరు. ఇద్దరూ కలిసి తిరుగుతారు. ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్ మాదిరిగా తిరుగుతూ అన్నిరకాలుగా కలిసి ఉంటారు.
కన్ఫ్యూజన్ (Entanglement)
వారు ఎదుటి వ్యక్తితో ప్రేమలో ఉన్నారో.. లేదా చీటింగ్ చేస్తున్నారో.. ఓ రిలేషన్లో ఉంటూ వారిపై ఫీలింగ్స్ పెంచుకుంటున్నారో వారికే తెలీదు. కన్ప్యూజన్ స్టేట్‌లో ఓ వ్యక్తిపై ఇష్టం ఉందో లేదో తెలుసుకునేందుకు కష్టపడతారు.
బ్రోమాన్స్ (Bromance/Womance)
ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. వారిద్దరూ రొమాన్స్ లేకుండా కపుల్స్లా బిహేవ్ చేస్తారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ.. వారి స్పేస్‌లోకి వేరే వాళ్లు రాకుండా రిలేషన్‌ని మెయింటైన్ చేస్తారు.
ఇలా వివిధ రకాల పేర్లతో సోషల్ మీడియాలో రొమాంటిక్ రిలేషన్షిప్ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా మరిన్ని రిలేషన్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

