అన్వేషించండి

Choco Chip Cookies : చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే

Choco Chip Cookies Recipe : గ్యాస్ స్టౌవ్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చాకో చిప్ కుకీస్ చేసుకోవచ్చు. అతి తక్కువ పదార్థాలతో, ఎగ్ లేకుండా చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం.

Eggless Choco Chip Cookies Recipe : ఇంట్లోనే పిల్లలకు బేక్ చేసిన ఫుడ్స్ పెట్టాలనుకుంటే.. ఇంట్లోనే ఈజీగా చాకో చిప్ కుకీస్ చేసుకోవచ్చు. ఎగ్​ లేకుండానే.. అతి తక్కువ మైదాపిండితో వీటిని టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్​గా, టేస్టీగా కుకీస్ ఎలా చేయాలో.. వాటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

బటర్ - 60 గ్రాములు

బ్రౌన్ షుగర్ -110 గ్రాములు

పాలు -15 గ్రాములు

బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్

వెనీలా ఎక్స్​ట్రాక్ట్ -1/2 tsp

మొక్కజొన్న పిండి - 60 గ్రాములు

మైదా పిండి - 90 గ్రాములు

బేకింగ్ సోడా -1/8 టీస్పూన్

ఉప్పు - చిటికెడు

డార్క్ చాక్లెట్ చిప్స్ - 70 గ్రాములు

తయారీ విధానం

చాక్లెట్ కుకీస్ చేయాలనుకుంటే ముందుగా ఒక బౌల్‌లో 60 గ్రాముల బట్టర్, 110 గ్రాముల బ్రౌన్ షుగర్ వేసుకుని బీటర్ లేదా విస్క్‌తో బాగా కలపాలి. షుగర్ కాస్త కరిగి.. బటర్ మెత్తగా అయ్యే వరకు బీట్ చేయాలి. తర్వాత అందులో అర టీస్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి మరోసారి బాగా కలపాలి.

ఇంకో బౌల్ తీసుకుని అందులో 90 గ్రాముల మైదా, మొక్కజొన్న పిండి, అర టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/8 టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసి జల్లించాలి. అలాగే 70 గ్రాముల డార్క్ చాక్లెట్ చంక్స్ లేదా చిప్స్‌ను ఈ పిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రిడియెంట్స్‌ను బట్టర్ మిశ్రమంలో కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhavani Reddy (@bhavanis_bakes)

మిక్స్ చేసిన తర్వాత 15 గ్రాముల పాలను కూడా జోడిస్తూ ముద్దలా చేసుకోవాలి. అయితే ఎక్కువసేపు కలపకూడదు. మిశ్రమం కలిసిన వెంటనే ఆపేయాలి. చివరగా చాకో చిప్స్ కలిసేలా చేసి రౌండ్ కలుపుకోవాలి. తయారైన పిండిని.. క్లింగ్ ర్యాప్‌తో కప్పి కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి సమాన పరిమాణంలో చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. వీటిని బేకింగ్ ట్రేలో అమర్చి.. కాస్త ఒత్తి పైన మిగిలిన డార్క్ చాక్లెట్ చిప్స్ లేదా చంక్స్ పెట్టాలి.

వీటిని 180 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో పెట్టి.. 15 నుంచి 20 నిమిషాలు బేక్ చేయాలి. కుకీస్ కింద భాగం లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారినప్పుడు అవి రెడీ అయినట్టే. బయటకు తీసి కాస్త చల్లారనిచ్చాక టేస్టీ, సాఫ్ట్ చాక్లెట్ కుకీస్‌ను ఆస్వాదించొచ్చు. సమ్మర్​లో పిల్లలకు టేస్టీగా చేయాలనుకుంటే వీటిని ఈజీగా చేసుకోవచ్చు. స్టౌవ్ అవసరం కూడా లేకుండా వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Embed widget