అన్వేషించండి

Healthy Recipes : వంట గ్యాస్ లేకున్నా చేసుకోగలిగే హెల్తీ రెసిపీ.. టేస్టీ ఫుడ్​తో బరువు కూడా తగ్గొచ్చు

No-Cook Healthy Recipe : గ్యాస్ లేకుండానే సింపుల్​గా కొన్ని హెల్తీ రెసిపీలు తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో యోగర్ట్​తో చేసుకోగలిగే హెల్తీ రెసిపీ కూడా ఒకటి. మరి దీనిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వంట గ్యాస్ అవసరం లేకుండా గ్రీక్ యోగర్ట్ సిద్ధం చేయవచ్చు.
  • గ్రీక్ యోగర్ట్, నట్స్, గింజలతో నిమిషాల్లో రెసిపీ తయారీ.
  • ఈ మిశ్రమం ప్రోటీన్, మంచి కొవ్వులతో శరీరానికి శక్తినిస్తుంది.
  • జీర్ణక్రియ, మెదడు పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

No Gas Needed Quick Greek Yogurt Recipe : వంట గ్యాస్ లేకపోయినా కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఎన్నో సింపుల్ మార్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో నట్స్, సీడ్స్‌తో చేసుకునే హెల్తీ రెసిపీ ఉంది. దీనిని వండాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే టేస్టీగా, హెల్తీగా తినేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్లు అందిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 

నట్స్ & సీడ్స్‌తో గ్రీక్ యోగర్ట్ కోసం కావాల్సిన పదార్థాలు

గ్రీక్ యోగర్ట్ – ఒక బౌల్

బాదం – 4 నుంచి 5

వాల్‌నట్స్ – 2 నుంచి 3

గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds) – ఒక టీ స్పూన్

తేనె – కొద్దిగా (పూర్తిగా ఆప్షనల్)

గ్రీక్ యోగర్ట్ 

గ్రీక్ యోగర్ట్ అనేది కొందరికి తెలియదు. ఇది సాధారణ పెరుగు కన్నా కాస్త మందంగా ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా వడకట్టే ప్రక్రియలో తయారు చేస్తారు. అందువల్ల దీనిలో సాధారణ పెరుగు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. జీర్ణక్రియకు కూడా సహాయం చేస్తుంది.

తయారీ విధానం

ఒక బౌల్‌లో గ్రీక్ యోగర్ట్ వేసి దానిపై బాదం, వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు చల్లి కలిపితే సరిపోతుంది. కావాలంటే కొద్దిగా తేనె కూడా కలిపి తినవచ్చు. అంతే… హెల్తీ రెసిపీ రెడీ. దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తీసుకోవచ్చు. ఎందుకుంటే ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. శరీరానికి శక్తి ఇస్తుంది. నట్స్, సీడ్స్‌లో ఉండే మంచి కొవ్వులు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందువల్ల ఎక్కువసేపు తృప్తిగా ఉంటుంది. ఆకలి వేయదు. చిరుతిళ్ల జోలికి వెళ్లరు. యోగర్ట్​లో ఉండే ప్రోబయోటిక్స్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్, బాదంలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి.. 

ఈ రెసిపీలోనీ ప్రోటీన్, ఫైబర్ వల్ల ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని తమ డైట్లో చేర్చుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటుంది. వర్క్‌ఔట్ తర్వాత కూడా తీసుకోవచ్చు. దీనివల్ల కండరాల రికవరీకి సహాయపడుతుంది. సాయంత్రం హెల్తీ స్నాక్‌గా తినవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం వంట గ్యాస్ లేకపోయినా.. ఉన్న గ్యాస్ సేవ్ చేస్తూ హెల్తీగా ఉండాలనుకున్నా.. ఈ ఇలా సింపుల్‌ గ్రీక్ యోగర్ట్‌ రెసిపీని తయారుచేసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget