Tofu vs Paneer : టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
Paneer vs Tofu : వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం పనీర్, టోఫు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటీలో ఏది మంచి ఆప్షన్ అవుతుందో చూసేద్దాం.

Weightloss Protein Source : భారతదేశంలో ప్రోటీన్ లోపం ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. దేశ జనాభాలో దాదాపు 70 నుంచి 80 శాతం మంది తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. అందుకే శాఖాహార ఆహారంలో ప్రోటీన్ వనరుల గురించి తరచుగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వాటిలో ప్రధానంగా పనీర్, టోఫు గురించిన చర్చ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏది ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది? బరువు తగ్గాలనుకుంటే దేనిని తింటే మంచిదనే డౌట్ చాలామందిలో ఉంటుంది? వీటికి ఆన్సర్స్ ఇప్పుడే తెలుసుకుందాం.
నిజానికి టోఫు, పనీర్‌లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే వీటిని వెజ్ డైట్లో సులభంగా చేర్చుతారు వీటి మధ్య ఎంతో సారూప్యత ఉన్నా.. కేలరీలు, కొవ్వు, ప్రోటీన్ నాణ్యతలో చాలా తేడా ఉంటుంది. ఫిట్‌నెస్ లక్ష్యాలపై వాటి ప్రభావం భిన్నంగా ఉంటుంది. మీరు కొవ్వును తగ్గించుకోవాలనుకున్నా, కండరాలను పెంచుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలనుకున్నా.. వీటిలో సరైనది ఎంచుకోవడం మంచిది. లేదంటే మంచి ఫలితాలు చూడలేదు.
రెండింటి మధ్య తేడాలివే..
టోఫును ఈ మధ్యకాలంలో చాలామంది ఉపయోగిస్తున్నారు. సోయా పాలను గడ్డకట్టించి.. దానిలోని నీటి శాతాన్ని దూరం చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇది పూర్తిగా మొక్కల ఆధారితమైనది. కాబట్టి దీనిని శాకాహారులే కాదు.. వీగన్స్ కూడా తీసుకుంటారు. పైగా ఇది ప్రోటీన్‌కు మంచి మూలం. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది హెల్తీ ప్రోటీన్‌కు మంచిదిగా చెప్తారు. పనీర్ కూడా భారతీయ వంటకాలలో అంతర్భాగమే. వేడి పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ వేసి దీనిని తయారు చేస్తారు. దీనిలో అధిక ప్రోటీన్ ఉంటుంది.
దేనిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది?
ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. పెద్దలు ప్రతిరోజూ ఒక కిలోగ్రాము శరీర బరువుకు సుమారు 0.8 నుంచి 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. పోషకాహార పరంగా.. 100 గ్రాముల టోఫులో సుమారు 76 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 4.8 గ్రాముల కొవ్వు ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 265 కేలరీలు, 18 గ్రాముల ప్రోటీన్, 20 గ్రాముల కొవ్వు ఉంటుంది. కాబట్టి ఈ రెండూ వాటి సొంత ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
టోఫు బరువు తగ్గడానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి. పైగా టోఫు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉంటారు. దీనివల్ల అతిగా తినే అవకాశం తగ్గుతుంది. ఇందులో మంచి మొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది ఎనర్జీ కోసం తీసుకుంటే మెరుగైన ఫలితాలు చూడగలుగుతారు.
బరువు తగ్గడానికి, కండరాలు పెంచుకోవడానికి మీ ఛాయిస్‌ని బట్టి వీటిని తీసుకోవచ్చు. అయితే వీటిని లిమిటెడ్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. డైట్లో చేర్చుకునే ముందు నిపుణులు సహాయం తీసుకుంటే మరీ మంచిది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























