అన్వేషించండి

Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !

Keralam Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఈ సారి గెలవకపోతే.. ఆ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేస్తుంది.

Do or die situation for Congress in Kerala assembly elections: కేరళ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక అసాధారణ గండం ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారం మార్పిడి జరిగే సంప్రదాయానికి గత ఎన్నికల్లో తెరపడింది. ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోవడంతో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్  ఉనికికే ప్రమాదం ఏర్పడింది. రాబోయే ఎన్నికలు కేరళ కాంగ్రెస్‌కు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఆ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న జీవన్మరణ  పోరాటం.

సంప్రదాయం బద్దలు.. కాంగ్రెస్ వైఫల్యం 

కేరళలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. సాధారణంగా అధికారం మారుతుందన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో లెఫ్ట్ కూటమి వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమైంది. పినరయి విజయన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విపత్తుల సమయంలో వారు చూపిన చొరవ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు, బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేశాయి.

 గాంధీ వారసుల ఇమేజ్‌కు పరీక్ష 

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి  రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు  ప్రియాంకా గాంధీ ఎంపీగా ఉన్నారు. ఆమె కేరళ రాజకీయాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు నేరుగా గాంధీ కుటుంబంపై ప్రభావం చూపుతాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న రాష్ట్రం కేరళ. ఇక్కడ కూడా వరుసగా మూడో సారి ఓడిపోతే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ సామర్థ్యంపై ,  గాంధీ వారసుల విన్నింగ్ కెపాసిటీ పై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతాయి.

కాచుక్కూర్చున్న బీజేపీ  

కేరళలో ఇప్పటివరకు ప్రధాన పోటీ కాంగ్రెస్, లెఫ్ట్ కూటముల మధ్యే ఉన్నప్పటికీ, ఈసారి సీన్ మారుతోంది. కాంగ్రెస్ బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే క్రైస్తవ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లో చీలిక వస్తే, అది బీజేపీకి వరంగా మారుతుంది. త్రిముఖ పోటీ ఏర్పడితే అది కాంగ్రెస్‌కు మరింత నష్టదాయకం.

డూ ఆర్ డై.. చివరి అవకాశం 

ఒకవేళ ఈసారి కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే, కేరళలో ఆ పార్టీ బెంగాల్ లేదా త్రిపుర తరహాలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే విజయం తప్పనిసరి. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. లెఫ్ట్ కూటమిని ఎదుర్కోవడానికి మతపరమైన సమీకరణాలను, యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.  కేరళ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారాయి. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా? లేక కాంగ్రెస్ తన పాత వైభవాన్ని చాటుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. కాంగ్రెస్‌కు ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు  అనే పరిస్థితి. ఈ పోరులో గెలిస్తేనే రాహుల్ గాంధీ నాయకత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, లేదంటే కేరళ గడ్డపై కాంగ్రెస్ జెండా మరింత పలచబడటం ఖాయం.

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget